మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజిపేట గ్రామంలో యుపిఎస్ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయురాలు కీర్తి వేస్ట్ పేపర్లతో టిఎల్ఎం మెటీరియల్ కు రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినట్లు ఉపాధ్యాయురాలు కీర్తి వెల్లడించారు.
ఆలోచనకు పదును పెట్టి సరైన పద్ధతిలో వినియోగిస్తే పనికిరానిది ఏది ఉండదని ప్రతిదీ వినియోగించు కోవచ్చని రుజువు చేసింది కీర్తి వేస్ట్ పేపర్లతో తయారుచేసిన ప్రాజెక్టు ఎఫ్ ఎల్ ఎన్, టి ఎల్ ఎం మేళలో ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రాజిపేట నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. మెదక్ లో జరిగిన ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషన్ లెట్రిసి అండ్ న్యూమరసి) టిఎల్ ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళలో రాజిపేట ఉపాధ్యాయురాలు కీర్తి పల్లె పట్టణం మధ్యలో తేడాలు చూపుతూ తరగతిలోని వేస్ట్ న్యూస్ పేపర్లు, అట్ట ముక్కలు, చార్ట్, గడ్డి, దారం, పాడైన పెన్నులు, గమ్ ప్లాస్టర్ లతొ అందమైన పట్టణం గ్రామం ఆకారాలు తయారుచేసి ప్రదర్శించారు.ఇందులో రహదారులు, వాహనాలు, పంట పొలాలు, అపార్ట్మెంట్ల, ఫ్యాక్టరీలు,నీటి కాలుష్యం, పార్క్, జూను, పల్లె పట్టణ వాతావరణం కనిపించేలా తయారు చేశారు. దీంతో మేళలో అందరినీ ఆకట్టుకోవడంతో ప్రదర్శన అధికారులు డిఈఓ రాధా కిషన్ రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి