పెద్దముల్ గర్ల్స్ ZPHS పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా పెద్దముల్స్థానిక జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ ఉన్నత పాఠశాలలో కాళోజి జయంతి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులుబాలల మాస పత్రిక మొలక స్పెషల్ కరస్పాండెంట్ KVM వెంకట్ తో పాటు ghm అక్క మహా దేవి ఉపాధ్యాయులుపాల్గొని ఆయన చిత్రపటం కు పూలమాలవేసి నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో వెంకట్ పాల్గొని మాట్లాడుతూ“కాళోజి నారాయణరావు కేవలం కవి మాత్రమే కాదు, ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ మార్పు కోసం కలం పట్టిన మహోన్నత వ్యక్తి. ఆయన తెలుగు భాషకు, సంస్కృతికి చేసిన సేవలు అపారమైనవి. యువత ఆయన స్ఫూర్తిని అనుసరించి మాతృభాషకు ప్రాధాన్యతనివ్వాలి” అని అన్నారు.
“తెలుగు భాష మన ఆత్మ, మన సంస్కృతి. ఇలాంటి వేడుకలు భాషా గొప్పతనాన్ని తెలియజేసే వేదికలు కావాలి.
తెలుగు భాషా కోసం కృషి చేస్తున్న మహిళా ఉపాధ్యాయులని, కవులని తాండూరు కవయిత్రి మొల్ల కళావేదిక తరపున మొల్ల
సాహిత్య పురస్కారం ప్రతి సంవత్సరం మొల్ల జయంతి13న ఆనవాయితీగా అందిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు భవిష్యత్తులో భాషా పరిరక్షకులుగా ఎదగాలి” అని పిలుపునిచ్చారు.బాల్యం లోనే తెలుగుపై మమకారం ప్రకృతిపై ప్రేమ పర్యావరణ పరిరక్షణ
సామాజిక బాధ్యత అవగాహన పెంచుకోవాలన్నారు మొలక పత్రిక ను చదవండి మొక్కల్ని నాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం అక్కమహాదేవి అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు ఉపాధ్యాయులు పైముదబేగం శకుంతల, యశోదర, విజయలక్ష్మి ,బుజ్జమ్మ, మాయాదేవి అలవేలమ్మ భాగ్యలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు భాషపై తమ అభిమానంవ్యక్తం చేశారు. చివరగా సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు మరింత హర్షోల్లాసంగా కొనసాగాయి.
పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులని ఘనంగా శాలువా పూలమాలవేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో అక్కమహాదేవి పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులోఉన్నతంగా రాణించి గ్రామానికి పాఠశాలకు తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు
“తెలుగు భాషా పరిరక్షణకు కాళోజి స్ఫూర్తి”:-కవయిత్రి మొల్ల కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు KVM వెంకట్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి