ఓ మనిషి మారాలి నీవు తెలిసి:- గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్9491387977. కల్వకుర్తి
మనిషి మనిషి ఓ మనిషి
మనిషివని నీవిక  తెలిసి
మానవత్వాన్ని పోషించు
దానవత్వాన్ని ద్వేషించు !

మనిషి మనిషి ఓ మనిషి
మనిషివని నీవిక  తెలిసి 
ప్రేమ తత్వాన్ని అలవర్చుకో
శ్రమ తత్వాన్ని ఇల కూర్చోకో !

మనిషి మనిషి ఓ మనిషి
మనిషివని నీవిక  తెలిసి
చేయొద్దు నీవిక తప్పులు
చేస్తే కలుగును ముప్పులు !

మనిషి మనిషి ఓ మనిషి
మనిషివని నీవు  తెలిసి
మమతల పందిరినే వేస్తే
సమతా సౌఖ్యం ఇక మస్తే !

మనిషి మనిషి ఓ మా మనిషి
అంతా సమానమని నీవు తెలిసి
కుల మతాల వ్యతిరేకత చూపొద్దు
ద్వేష విద్వేషాలతో నీవూగిపోవద్దు

మనిషి మానవత్వం ఉన్న ఓ మనిషి
మతాలు సర్వసమతాలు అని తెలిసి
విశ్వ మతాల విషయాలను ఆదరించు
సర్వేజనా సుఖినోభవంతు అని 
దీవించు



కామెంట్‌లు