పిల్లా పిల్లా ఓ మరదలు పిల్లా
ప్రేమించుకుందాం రా నువ్వు మల్లా
కింద మీద పడుతూనే ఉందాము
ఇక ప్రేమ విందు తింటూనే ఉందాము !
పిల్లా పిల్లా ఓ మరదలు పిల్లా
పల్లకి ఎక్కి వస్తావా నీవు మల్లా
ఒకరికి ఒకరం హత్తుకుందముడ
ఎవరేమన్ననూ గమ్ముగుందము !
పిల్లా పిల్లా ఓ మరదలు పిల్లా
ప్రేమ పల్లకిని ఎక్కిస్తాను మళ్లా
ప్రేమ దోమ అంటూ చేయకు లొల్లి
ప్రేమతో ఊరేగిస్తానులే నే గల్లి గల్లి!
పిల్లా పిల్లా ఓ మా మరదలు పిల్లా
ప్రేమతోముద్దులిచ్చి పోవే మల్లా
నీ జ్ఞాపకాలతోనే నేను ఇక జీవిస్తా
నీవే నా సతివని మదిలో భావిస్తా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి