" పంట బీమా ప్రతి రైతుకు రక్ష" : - - డా.వాసరవేణి పర్శరాములు, బాలసాహిత్య రచయిత, పరిశోధకులు -సెల్:9492193437
  సింగారం గ్రామంలో నర్సయ్య -లక్షీ దంపతులు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.ఇద్దరు కుమార్తెలున్నారు. రెండున్నర ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగుచేశారు. నీళ్లు సరిపడా లేక పోవడం వలన వర్షాధార పంటగా మొక్క జొన్న వేసారు. దున్నడం, కలుపు తీయడం , ఎరువులు చల్లడం చాలా ఖర్చు చేశారు. వీరి కుమారుడు రాములు 9వ తరగతి. చదువుకుంటూనే పొలం పనులకు సహకరించాడు. అడపా దడపా పడిన వర్షాలకు మొక్క జొన్న జుట్టు వేస్తుంది. కంకులు బయటకు వచ్చాయి. కానీ విత్తులు పాలతో లేతగానే ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో అనావృష్టితో మొక్క జొన్న విత్తులు పూర్తిగా కాకుండానే చేను అంతా ఎండిపోతుంది. నర్సయ్య కుటుంబం బాధలో మునిగిపోయింది. ఎండిన మొక్కజొన్న కోస్తారు. కంకుల బూరు తీస్తారు. ఎక్కడనో కొంచెం అక్కడక్కడా బలపడిన  విత్తులున్నాయి. అన్నీ కలిపి నాలుగు బస్తాల కంకులు అవుతాయి. కైకిళ్లు రెండు బస్తాలు వేయగా కౌలు బస్తా పోగా మిగిలిన ఒక బస్తాను చూసిన నర్సయ్య, రాములు కన్నీటి పర్యంతం అయ్యారు. పెట్టుబడులు రాకపోగా చేసిన కూలీ పడలేదు .రాములు బడికి మరీ తప్పించి దున్నడం, గడ్డి తీయడం, మందులు చల్లడం, కాపలా కాయడం, కోయడం, కంకి బూరు తీయడం అనేక పనులు చేసాడు. రెండు రోజుల కైకిలి కూడా రానీ ధాన్యం చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. నర్సయ్య కుటుంబంలో కూతురు పెళ్లి ఖర్చులు, లక్ష్మి అనారోగ్య ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టాడు. రైతులకు ములుగర్ర మిగులదన్నట్టు బాధపడ్డాడు. కొడుకు రాములు నాన్నా పంటభీమా చేస్తే బాగుండు. మా బడిలో సార్ చెప్పాడు. కరువుకాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా పంటలు  నష్టం జరిగితే డబ్బులు కట్టిస్తారటా మనము కడితే పంట భీమా వచ్చేది. ఎల్లారెడ్డి పేటలో పంట ఎండిపోతే భీమా చేసిన  రైతులకు బీమా డబ్బులు చెల్లించారటా అన్నాడు. అనగానే సరే మనంకూడా పంటభీమా కడుదాం, మనలాంటి రైతులకు చెబుదాం అన్నాడు నర్సయ్య.

కామెంట్‌లు