*సామాజిక అభ్యుదయ దిక్సూచి నేదునూరి కనకయ్య)* : - - *డా.వాసరవేణి పర్శరాములు* ,9492193437
 (అక్టోబర్ 14 


నేదునూరి కనకయ్య గారి 70వ జన్మదినం సందర్భంగా)

 *బాల్యం:*
      నేదునూరి కనకయ్యగారు 14-10-1955లో వీరమ్మ-బాలయ్య పుణ్యదంపతులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లిగ్రామంలోజన్మించారు.బాల్యంగ్రామంలోగడిచింది.బాల్యంనుండే పేదరికం అనుభవించి పేదల కష్టసుఖాలు తెలిసినవారు.ఒకవైపు ఇంటిపనులు చేస్తూనే మరొకవైపు చదువునుకొనసాగించారు.స్నేహితులతో కలుపుగోలుగా మెదిలేవారు.పేదరికం ఒకవైపు కుటుంబంలోఅందరూ నిరక్షరాస్యులు మరొకవైపు అయినా కష్టపడి విద్యారంగంలో సాగినవారు.కులవ్రృత్తిలోను,వ్యవసాయంలోను కుటింబీకులకు సహాయంఅందించారు.మోటగొట్టడం,పొలం పనులుచేశారు.కుండలు కాల్చడానికీపొరుకకట్టెలుతెచ్చారు.పశువులు కాసారు.కరెంట్లేని కాలం అది.
 
విద్యభ్యాసం.
      
ఎన్నో కష్టాలు ఎదుర్కుంటునే కనకయ్య  ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాల కల్లెపల్లి,సెకండరీ విద్య బెజ్జంకి(1973)లో,ఇంటర్మీడియట్ విద్య  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ట్స్ విభాగం కరీంనగర్(1973-75)లో,డిగ్రీ బి.ఎ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(1975-78)లో,పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల హైదరాబాద్(1978-80)లో,ఎల్.ఎల్.బి ఉస్మానియావిశ్వవిద్యాలయం హైదరాబాద్ కాలేజీ (1980-83)లో, కరీంనగర్ జిల్లాలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న బాల కార్మికుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రొఫెసర్ కె వెంకట్ నారాయణ గారి పర్యవేక్షణలో ఎంఫిల్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లుపూర్తిచేశారు,పిజిడిహెచ్ఇ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ న్యూడిల్లీ(1998)లోను చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ముందుకు సాగిన ఘనులు.
 *వైవాహిక జీవితం*:
      నేదునూరి కనకయ్యగారు హైదరాబాద్ వాస్తవ్యులు ప్రముఖ సంఘసేవకులు జాలిగామ ఈశ్వరయ్యగారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టీస్ జస్టీస్ కుమారయ్యగారి మనవరాలు సరిత గారిని 1980లో పెళ్లి చేసుకున్నారు.కనకయ్య-సరితలకు ఇద్దరు సంతానం.నేదునూరి సుశ్మ అమెరికాలో డాక్టర్.నేదునూరి నిఖిల్ అమెరికాలో సాఫ్టువేరు ఇంజనీర్.ఇద్దరికి వివాహాలు జరిగాయి.
 *ఉద్యోగ జీవితం:*
      కనకయ్యగారు  మొదటగా ఐఎఎస్, ఐఈఎస్ గ్రూప్ 1పరీక్షలు రాసి ఇంటర్వ్యూలకు వెళ్లారు. లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన ధైర్యంతో అధ్యాపకులుగా బోధనాసేవలందించి వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనులు. బిషప్ కళాశాల కరీంనగర్లో 30 సంవత్సరాలు అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా బోధన చేశారు.1990-96 వరకు కరీంనగర్ జస్టిస్ కుమారయ్య లా కళాశాలకు సంస్థాపక గౌరవ కరెస్పాండెంట్ గా సేవలందించారు.ఎంతో మంది విదార్థులు నేడు హై కోర్టులో ఉత్తమ న్యాయవాదులుగా గుర్తింపు పొందడం విశేషం
 *నాయకత్వం-వివిద పదవి బాధ్యతలు*:
      నేదునూరి కనకయ్యగారు విద్యార్థిస్థాయినుండే నాయకత్వ లక్షణాలుఅలవర్చుకున్నారు.బెజ్జంకి హైస్కూలు విద్యార్థి సంఘంలో సాహితీ సాంస్కృతిక కార్యదర్శిగా, ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ&పిజి కళాశాల విద్యార్థి సంఘానికి 1977-78లో ప్రధానకార్యదర్శిగా,
1978_1979 ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల  విద్యార్థి సంఘం ఎన్నిల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు.
1992-94లో పి.జె.సి.ఎల్.ఎ జోనల్ సెక్రటరీగా,1994-96లో ఎయిడెడ్ జూనియర్ కళాశాల లెక్షరర్ల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉపాధ్యక్షుడుగా,శ్రమదాన,ఆరోగ్య శిభిరాలకు సమన్వయకర్తగా, కరీంనగర్లో ఎకనామిక్స్ ఫోరం ఏర్పాటుచేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక 'తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం ' తెలంగాణ వికాస వేదిక ' సమాచార హక్కు పరిరక్షణ సమాఖ్య లాంటి స్వచ్ఛంద సంస్థ లకు వ్యవస్థాపక అధ్యక్షులు గా బాధ్యతలు నిర్వహించి నిరంతరం సామాజిక చైతన్యం కోసం పలు సదస్సులునిర్వహించి యువతకు స్ఫూర్తి గా నిలవడం వీరి ప్రభావ శీల వ్యక్తిత్వానికి నిదర్శనం.
 కరీంనగర్ జిల్లా వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడుగా,జిల్లా ఎడ్యుకేషన్ ఫోరం ప్రధానకార్యదర్శిగా, జనవిజ్ఞానవేదిక కార్యవర్గ సభ్యులుగా,తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారులుగా,వాకర్స్ క్లబ్ కరీంనగర్ సెంట్రల్ ప్రధానకార్యదర్శిగా, చైల్డ్ లేబర్ అవెర్నెస్ ప్రోగ్రాం ఆన్ ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ కరీంనగర్ జిల్లా కన్వీనర్గా,ఆల్ ఇండియా శాంతి సంఘీభావ సంఘం కరీంనగర్ శాఖకు ప్రధానకార్యదర్శిగా,ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా, సలహాదారులుగా బాధ్యతలు నిర్వహించి కళాశాల ఎన్ ఎన్ ఎస్ యూనిట్ కు ఇందిరాగాంధీ జాతీయ స్థాయి అవార్డ్ రావడముతో కనకయ్య గారు క్రియాశీలక పాత్ర పోషించారు. 2002-2005 అఖిలభారత విద్యార్థి పరిషత్ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడుగా 2005-07 కరీంనగర్ ప్రజ్ఞాభారతిశాఖా ఉపాధ్యక్షుడుగా,2008లో సహచట్టం సమైక్య రక్షణవేదిక కరీంనగర్ జిల్లాశాఖ ఉపాధ్యక్షుడుగా,2004-2005 జనవిజ్ఞానవేదిక కరీంనగర్ జిల్లాశాఖ ఉపాధ్యక్షుడుగా,,2004లో అసెంబ్లీ,పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థుల ముఖాముఖి చర్చ ఈనాడు ఆధ్వర్యంలో కార్యక్రమానికి కో ఆర్డినేటర్గా, శాతవాహన లైన్స్ క్లబ్ సభ్యులుగా,1989 లో కుమ్మర్ల సంఘం వ్యవస్థాపకుడుగా,1990-2003 ఆంధ్రప్రదేశ్ కుమ్మర్ల సంఘం కరీంనగర్ శాఖ కార్యదర్శిగా పదవి బాధ్యతలు నిర్వహించారు.కరీంనగర్ బిసి సంఘం ఉపాధ్యక్షుడుగా, ఇంటర్ విద్య తెలంగాణ జాక్ కరీంనగర్ జిల్లా కో కన్వీనర్గా,2004-05 ఎకనామిక్స్ సబ్జెక్టు ఓరియెంటేషన్ క్యాంపు 5జోన్ వరంగల్కు కో ఆర్డినేటర్,2004-05 క్యాంప్ హైదరాబాద్ కో ఆర్డినేటర్,ఎన్.ఎస్.ఎస్ జాతీయ సమైక్యత శిభిరం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఆధ్వర్యంలో 2006 లో శాతవాహన పిజి సెంటర్ కరీంనగర్లో జరుగగా 16 రాష్ట్రాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ శిభిరంలో మీడియా హించార్జ్ కన్వీనర్గా,1990 నుండి1996 వరకు జస్టిస్ కుమారయ్య లా కళాశాల సంస్థాపక గౌరవ కరెస్పాండెంట్గా,ఈటివి,మాటివి,టివి9,ఎన్ టివి,టివి5,జిటివి కరీంనగర్లో నిర్వహించిన పలుకార్యక్రమాలకు కన్వీనర్గా వ్యవహరించారు. కరీంనగర్లో 20యువజన సంఘాలు ఏర్పాటుచేసి సంఘాల సమితి ప్రెసిడెంట్గా,కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలలకు స్వదేశీజాగరణ్మంచ్ కన్వీనర్గా అనేక క్రీడా,సాహిత్య,సాంస్కృతిక,సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నవారు.2013 అక్టోబర్ 20న కరీంనగర్లో "ఉత్తర తెలంగాణ రాజకీయ,ఆర్థిక వనరులు, సమస్యలు,పరిష్కారాలు"అను సదస్సుకు కోఆర్డినేటర్గా వ్యవహరించారు.సామాజిక ఆర్థిక చైతన్య వేదిక ఏర్పాటుచేసి అధ్యక్షుడుగా సాగుతున్నారు.
 *సామాజిక చైతన్య కార్యక్రమాలు*:
      కనకయ్యగారు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పాల్గొన్నారు కూడా.జాతీయసేవాపథకం,మద్యపాన నిషేధం, పర్యవరణ పరిరక్షణ,గ్రంథాలయం,జనవిజ్ఞానవేదిక,బాలకార్మిక నిర్మూలన,హరితహారం,వినియోగదారుల సంక్షేమం,పేదరిక నిర్మూలన,అంటరానితనంకు వ్యతిరేకంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 *రచనలు-సాహిత్యం* :
      ,"కళ్యాణ్ కలం"పేరుతో రాసిన సంపాదక లేఖలు ప్రముఖ దినపత్రికలలో ప్రచురింపబడినాయి.కవితలు,పాటలు,వ్యాసాలు,పత్రిక ప్రకటనలు,లేఖలు,సెమినార్ పత్రాలు,నాటికలు మొదలగు సాహిత్య రచనలు చేశారు బిఎ ఫస్టీయర్లో "స్వార్థానికి సంకేళ్లు" రాసి కళాశాలలో ప్రదర్శించారు.1990లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకోసం "అర్థశాస్త్రం ప్రాథమిక సూత్రాలు"అను పాఠ్యపుస్తకం రాసారు.అసంఘటిత రంగం లో బాలకార్మికుల సాంఘిక ఆర్థిక పరిస్థితులు వేతనాలు ( కరీంనగర్ పట్టణములో ప్రైవేట్ హోటళ్లలో  పనిచేస్తున్న బాల కారికుల జీవితాలమీధ రాసిన) పరిశోధనాత్మక వ్యాసం ఐక్యరాజ్యసమితి  ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO)  పబ్లిష్ చేసిన  పుస్తకములో  ప్రచురించబడ్డది.200లకు పైగా వ్యాసాలు,1000కి పైగా సంపాదకలేఖలు రాశారు."వాడిన బతుకులు"కథ రాసారు.
 *పలు కార్యక్రమాలు సదస్సులు నిర్వహణ:*
      1.ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అసోసియేషన్ 6వ వార్షిక సదస్సులో (సమావేశంలో) పేపర్ సబ్మిటెడ్ ఆన్ ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇన్ కరీంనగర్ జిల్లా  23-24జనవరి 1988  శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కరీంనగర్.
2.ఆల్ ఇండియా లేబర్ ఎకనామిక్స్ కాన్ఫరెన్స్  ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ డిసెంబర్ 22-24,1990 హైదరాబాద్,
3.2009లో "ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో సంస్కరణలు"అను అంశంపై జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్వర్యంలో కార్యక్రమం.
4 2013లో తెలంగాణ వివేక రచయితల సంఘం,తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో "తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణపై సిరిసిల్లలో సదస్సు నిర్వహించారు.
5.1995లో "సామాన్యుని ఆర్థికపరిస్థితులపై అధ్యనం అంశంపై కార్యక్రమం.
6. అక్టోబర్20,2013న "ఉత్తర తెలంగాణ సామాజిక,ఆర్థిక సమస్యలు" యూనివర్సిటీ ప్రొఫెసర్లు రిసెర్చ్ స్కాలర్స్"అను అంశంపై సదస్సు నిర్వహనలో కో కన్వీనర్గా వ్యవహరించారు. 1999 లోఐక్యరాజ్యసమితి విభాగము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రచురించిన Child labour in the world) "ప్రపంచములో బాలకార్మికులు "అన్న సెమినార్ 
బుక్ లో  నేదునూరి కనకయ్య అసంఘటిత రంగంలో బాల కార్మికుల సాంఘిక ఆర్థిక స్థితి గతులు  కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ హోటళ్లలో పనిచేసిన బాలకార్మికుల మీద రాసిన  పరిశోధక పత్రం పబ్లిష్ అయ్యింది. సుమారు వెయ్యికి పైగా కార్యక్రమాలు నిర్వహించారు.
 *తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర:*
      1969లో విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో కనకయ్యగారు పాల్గొన్నారు.1997లో సిరిసిల్లలో "తెలంగాణ సదస్సు"నిర్వహించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఉపన్యాసాలద్వారా తెలిపారు.తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక దోపిడీని నిరసించారు. కొండాలక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో ప్రజాతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు తెలంగాణ మేధావుల సదస్సులో చురకైన పాత్ర పోషించారు.2013లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేయగానే "తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణపై సిరిసిల్లలో సదస్సు నిర్వహించారు.2013 అక్టోబర్ 20న కరీంనగర్లో "ఉత్తర తెలంగాణ రాజకీయ,ఆర్థిక వనరులు,సమస్యలు పరిష్కారాలు"అను సదస్సులో కోఆర్డినేటర్గా వ్యవహరించారు.
 *అవార్డులు-ప్రశంసలు:*
      బెస్ట్ యూత్ అవార్డు,2004 డిసెంబర్ 1న బెస్ట్ ఏయిడ్స్ నోడల్ లెక్చరర్ అవార్డు,20011 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాస్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు,2002లో ఎబివిపి కరీంనగర్ జిల్లాశాఖ ఉత్తమ అధ్యాపక అవార్డు 2005లో ఎస్.ఆర్.ఆర్ కళాశాల గోల్డెన్ జుబ్లీ ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నుండి ఉత్తమ ఆర్థికవేత్త అవార్డు,2006లో "ఆర్థిక. సంస్కరణలు ప్రభావం"సదస్సులో ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డిచే ప్రశంసాపత్రం సత్కారం,2011 ఎప్రిల్ 22న తెలంగాణ ఆత్మబంధువు అవార్డు,తెలంగాణ వివేక రచయితల సంఘంచే "సామాజిక,సాహిత్య సేవకులు సత్కారం,రాష్ట్ర,జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో అనేక ప్రశంసాపత్రాలు,స్వచ్ఛంద సంస్థలచే సత్కారాలు,మేధావుల ప్రశంసలు పొందారు.
 *నేదునూరి కనకయ్య వ్యక్తిత్వం:*
      కనకయ్యగారు బాల్యంనుండే అనేక విషయాలు అనుభవం ద్వారా నేర్చుకున్నారు.సమస్యలు ఎదుర్కొంటు ధైర్యంతో ముందుకు సాగారు. సమానతే ఆయన ధ్యేయం వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత వారిది. బోధనాసేవలతోపాటు,వైవాహిక జీవితంలో,నిజ జీవితంలో నిబద్ధతతో,ఆత్మస్థైర్యంతో ముందుకు సాగారు.కల్మషంలేని వ్యక్తి.ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు.అను నిత్యం సమాజ చైతన్యం కోసం,బాగుకోసం పరితపించేవారు.పరితపిస్తున్నవారు. ఆపదలో ఉన్నవారిని అర్థంచేసుకుని సహాయం చేస్తారు.సమాజచైతన్యం కోసం మూడనమ్మకాల. నిర్మూలనకోసం,నిరక్షరాస్యత నిర్మూలనకోసం,పిల్లల స్రజనాత్మకత వెలికి తీయడంకోసం అనేక సమావేశాలు నిర్వహించారు. ప్రధానంగా యువతను ప్రోత్సహించడంలో క్రృషి చేస్తున్నారు. ముందుగా తన కల్లెపల్లి గ్రామంలోనే చైతన్యం కోసం క్రృషి చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. గ్రామసేవలో పాల్గొన్నారు. ఎంత ఉన్నతస్థాయికి ఎదిగిన నిరాడంబరంగా,సామాన్యునిలా అందరిలో కలిసిపోయి కలుపుగోలుగా ఉంటారు.అనేక పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించారు. తన తల్లిదండ్రులు కనిపెంచి పెద్ద చేశారనీ మరిచిపోకూడదనీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను దైవంగా భావించాలంటారు.సమయపాలన పాటించాలనీ,చేసే ఉద్యోగానికైనా,పదవికైనా న్యాయం. చేయాలంటారు. ప్రజల్లో చైతన్యం నింపాలనీ,నీతి లేకపోతే సమాజం భ్రష్ఠుపట్టిపోతుందనీ వాటిని పెంపొందించాలనీ,దేశంలో విద్యావంతులుగా రాణించాలని,ప్రతి పౌరుడు సామాజికంగా,సాంస్కృతికంగా,రాజకీయంగా,ఆర్థికంగా ఎదుగాలనీ,దేశభక్తి కలిగి ఉండాలనీ దేశాభివృద్ధి కాంక్షిస్తారు. 2013లో నేదునూరి కనకయ్య జీవితంపై తెలుగు ఉపన్యాసకులు,బాలసాహిత్య రచయిత డాక్టర్ వాసరవేణి పరశురాం "మట్టిలో మాణిక్యం" పుస్తకం రాయగా తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రచురించగా  నేదునూరి కనకయ్య పదవీవిరమణ సందర్భంగా సిరిసిల్లలో అప్పటి ఎమ్మెల్యే కె.టి.ఆర్ గారు ఆవిష్కరించారు.
 *నేదునూరి కనకయ్య ఆశయాలు:*
      కనకయ్యగారు అంబేద్కర్, పూలే,స్వామి వివేకానంద,గాంధీ,సిద్ధప్ప మొదలుగువారి ఆశయసాధనకు క్రృషి చేయాలంటారు.వ్యవసాయరంగంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్రమాభివ్రృద్ధే దేశాభివృద్ధి అని ,సాగునీటికి నిధులు ఎక్కువ కెటాయించాలనీ,యువతకు ఉపాధి,ఉద్యోగవకాశాలు కల్పించాలనే భావన కలిగినవారు. బడ్జెట్లో ప్రజలు సమిష్టి డిమాండ్ను కొనుగోలు శక్తిని పెంచేందుకు నిధులు కెటాయించాలనీ సామాజిక,ఆర్థిక వికాసం,ఆర్థిక స్వయం సమ్రృద్ధిని పెంచే వ్రృద్ధి వ్యూహాలు అమలు చేయాలనే భావన కలిగినవారు.విదేశీపరిశ్రమలకంటే స్వదేశీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలంటారు. భారతదేశంనుండి మేధోవలసలు ఇతర దేశాలకు అధికంగా ఉన్నాయనీ,ఇక్కడ డాక్టర్లు,ఇంజనర్లు,శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఈదేశం కోట్లు ఖర్చు పెడితే వారి సేవలు ఫలితాలు ఇతర దేశాలకు అందుతున్నాయనీ మార్పులు రావాలని,మన దేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నాయనీ ఉపయోగించుకోవాలని,దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచి విదేశీమారకద్రవ్యం సంపాదించాలంటారు.ప్రభుత్వరంగసంస్థలను బలోపేతం చేయాలనే తపనకలిగినవారు. ప్రజలను చైతన్యపరుచాలని,ఆర్థిక అసమానతలు తొలిగించాలనీ,గ్రామీణ యువతకు పథకాలపై అవగాహన కల్పించాలని,రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలనీ,చేతివ్రృత్తులు,కుటీర పరశ్రమలు ప్రోత్సహించి మార్కెట్ సౌకర్యం కల్పించాలని,ఆర్థికశాస్త్రవేత్తలతో అభివృద్ధి జరుగుతుందనే ఆశయం కలిగినవారు. పరిశోధనలకు ఎక్కువ నిధులు కెటాయించాలనీ మానవత్వ వ్రుద్ధికి భవిష్యత్తుకు బాటలు వేయాలనే అంటారు.అలాంటి ఆశయం కలవారు.
            ఇట్లు/
 డా.వాసరవేణి పర్శరాములు,9492193437,బాలసాహిత్య రచయిత,పరిశోధకులు,తెలంగాణ వివేక రచయితల సంఘం,అధ్యక్షుడు,గ్రా:సింగా


కామెంట్‌లు