చిన్నోడికి సూర్యుని సందేశం :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
అమ్ముకోకు నమ్మకాన్ని
కోల్పోకు గౌరవాన్ని 
అవి పోతే తిరిగిరావు
వదలకు సంస్కారాన్ని

తప్పిపోకు న్యాయాన్ని
మరువబోకు ధర్మాన్ని
ఎట్టి పరిస్థితులోనూ
కాదనకు రక్త బంధాన్ని

ముఖమున మందహాసాన్ని
గుండెల్లో ధైర్యాన్ని
ఎప్పుడూ వీడవద్దు
శ్రేష్టమైన స్నేహాన్ని

సాధించిన విజయాన్ని
పెట్టుకున్న ఆశయాన్ని
చులకనగా చూడరాదు
మంచి చేయు దైవాన్ని


కామెంట్‌లు