పొత్తం చెప్పిన సత్యాలు: - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, 9966414580
శ్రేష్టులే జ్ఞానంలో
శ్రీమంతులు గుణంలో
అయితేనే గౌరవము
అగును బ్రతుకు సార్ధకము

గగనమంత ప్రేమలో
క్షమాగుణం మనసులో
ఉంటేనే బంధాలు
వెలుగుతాయి జీవితాలు

పుడమియంత సహనంలో
పసిపాపలా నవ్వులో
ఉండాలి నిరంతరము
కావాలి అగ్రస్థానము

ప్రతిదినం ధ్యానంలో
పెద్దవారి సేవలో
తరిస్తే బహు దీవెన
కడు క్షేమమే బ్రతుకున


కామెంట్‌లు