స్వర్ణ వాహిని దండే కు జాతీయ సాహిత్య ప్రతిభ పురస్కారం

 శ్రీమతి స్వర్ణ వాహిని దండే కు  ఈ ఏడాది “జూటూరు విజయలక్ష్మి జాతీయ సాహిత్య ప్రతిభ పురస్కారం” లభించింది.
ఈ అవార్డును నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా సూరేపల్లి రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రముఖుల సమక్షంలో శాలువా, మేమెంటో, వస్త్ర కిరీటం  అందజేయనున్నారు.
విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న స్వర్ణ వాహిని గారు పలు ఉన్నత విద్యార్హతలతో పాటు “Problems of Adolescents and Solutions” పుస్తక రచయితగా కూడా గుర్తింపు పొందారని సూరేపల్లి  రాములమ్మ ఉమెన్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ ఒక ప్రకటనలో  తెలియజేశారు. 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఇలాంటి గొప్ప సాహితీమూర్తులకు మీ ద్వారా పురస్కారం అందించడం అనేది స్త్రీ జాతి గర్వించదగ్గ విషయం.. శ్రీమతి స్వర్ణ వాహిని దండే గారు గొప్ప విద్యావేత్త అంతే కాకుండా మంచి సాహితీ మూర్తి, పరిపూర్ణమైన స్త్రీ మూర్తి కూడా మీకు అభినందనలు అలాగే పురస్కారాన్ని అందుకుంటున్న శ్రీమతి స్వర్ణ వాహిని దండే వారికి 🌹🌷🌺💐నా అభినందనలు