తెలంగాణాలో బాల సాహిత్య ఉద్యమం నడుస్తున్నదని, ఇది రేపటి సమాజానికి శుభ సూచకమని ,బాలలు అద్భుతంగా రచనలు చేస్తున్నారని,విద్యార్థులు తమ పరిసరాలలోని అంశాలనే ఇతివృత్తాలుగా చేసుకుని కథలు వ్రాసి మంచి పేరు తెచ్చుకోవాలని,మన మాతృ భాష కు ప్రాధాన్యత నివ్వాలని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య అన్నారు.బుధవారం అక్టోబర్ 8వ తేదీన సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది బాలల కథల పోటి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై,27 మంది విద్యార్థులకు నగదు బహుమతులు,అభినందన పత్రములు అందించారు.అనంతరం విద్యార్థులను కథలు వ్రాసేలా ప్రోత్సహించిన 29 మంది ఉపాధ్యాయులను సన్మానించారు.సుగుణ సాహితి సమితి అధ్యక్షులు మొసర్ల మాధవరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు డా. మట్ట సంపత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మనం మన వ్యవహారిక భాషలో రచనలు చేయాలని,బాల సాహిత్య వికాసం జరగాలని,చిన్నారులను సాహిత్యం వైపు ప్రోత్సహించే సంస్థల సేవలను కొనియాడారు. సుగుణ సాహితి కన్వీనర్ భైతి దుర్గయ్య మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలనుండి ఉగాది బాలల కథల పోటీలు నిర్వహిస్తున్నామని ,నేటివరకు 1200 కి పైగా విద్యార్థులు కథలు వ్రాసారని,బాలలు కథలు వ్రాసే విధంగా వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కూడా గౌరవిస్తున్నామని చెప్పారు.,బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ లో బాల సాహిత్యం వికాసం చెందుతుందని,అందుకు ఇక్కడి ఉపాధ్యాయుల ఎనలేని కృషి ఉందని అన్నారు.,కోహెడ మండల విద్యాధికారి రాళ్లబండి పద్మయ్య,,బాల సాహితి వేత్త కందుకూరి భాస్కర్, ఎన్నారై మొసర్ల జానకీ, బాల సాహిత్య రచయిత గుండ్ల రాజు ప్రసంగించారు. యువ కవి వేల్పుల రాజు అద్భుత వ్యాఖ్యానం చేయగా జిల్లాలోని ఉపాధ్యాయులు , విద్యార్థులు తల్లిదండ్రులు ,బాల సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బాల సాహిత్య ఉద్యమం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి