ఔరా..! ఔరా..!!
ఏమీ ఆ అహంకారం..?
ఎంతటి మతోన్మాదం..?
ఇది భారత రాజ్యాంగానికి
"మాయని మచ్చను" తెచ్చిన రోజు...
ఇది న్యాయవ్యవస్థ చరిత్రలో
ఒక చీకటి రోజు...
ఇది న్యాయదేవత కన్నీళ్లు పెట్టిన రోజు...
ప్రజాస్వామ్య పునాదులు కదిలిన రోజు...
భారత ప్రధాని వంటి
అత్యున్నత న్యాయపీఠాన్ని
అధిరోహించిన తిరుగులేని తీర్పులిచ్చే
భారత ప్రధాన న్యాయమూర్తి...
జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై...నిండు సభలో
"సనాతన ధర్మాన్ని
"అవమాన పరిస్తే సహించేది" లేదంటూ...
న్యాయ వాదులే దిగ్భ్రాంతి చెందేలా...
సాక్ష్యాత్తు న్యాయదేవతే నివ్వెరపోయేలా
కాలిబూటును విసిరిన
తిరుగుబాటు చేసిన ఆ న్యాయవాదికి...
"న్యాయ వ్యవస్థను...
"భారత రాజ్యాంగాన్ని...
"ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిస్తే...
"సహించేది"...లేదంటూ...
న్యాయ దేవతనే కించపరిచిన
న్యాయ వ్యవస్థకే మాయని మచ్చ
తెచ్చిన మతిస్థిమితం కోల్పోయిన...
ఆ మతోన్మాదిని...
"కాలి బూట్లతో కొట్టి ఊరేగించడం...
"కఠిన కారాగారశిక్ష విధించడం ఉత్తమం...
అట్టి అహంకార పూరిత...
దుష్ట...దుర్మార్గ...దుశ్చర్యలకు
మరెవ్వరూ సాహసించకుండా...
అట్టి అమానవీయ...అవమానకర...
అతిహేయమైన...పిరికి దాడులు...
మళ్ళీమళ్ళీ పునరావృతం కాకుండా...
భారతీయ న్యాయవ్యవస్థలో
చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోయేలా
"కాలి బూటును కాదు...
"తెల్లకాగితాన్ని సైతం విసరాలంటే...
"గుండేల్లో గుబులు రేగేలా...
"మతోన్మాద న్యాయవాదుల...
"వొంట్లో వణుకు పుట్టేలా...
"ముఖంలో చెమటలు పట్టేలా...
"నీ జాతి నీకు హారతి పట్టేలా...
"అంబేద్కర్ ఆత్మ శాంతించేలా...
మరుపురాని...
మరిచిపోలేని...
తిరుగులేని...ఒక
"సంచలనాత్మకమైన తీర్పును"..
ఓ న్యాయమూర్తి ఇవ్వాలి ఇవ్వాలి...మీరు
ప్రపంచమంతా ప్రతిధ్వనించాలి...మీ పేరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి