చెస్ బాగా ఆడేవారు జీవితంలో దేనినైనా సాధించగలరని పాకాల లయన్స్ పబ్లిక్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ మారసాని విజయబాబు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల, సత్యం చారిటబుల్ ట్రస్ట్, సహచర సమాంతర ఆలోచనల సామాజిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి చెస్ పోటీలను మండల విద్యాధికారి బాబ్జీ గారితో కలసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మారసాని విజయబాబు మాట్లాడుతూ గెలుపునకు పునాది చెస్ అని వివరించారు. అందువల్ల మండలంలోని విద్యార్థులకు చెస్ పై మక్కువ కలిగించేందుకు ఈ పోటీలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. పోటీల అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల అధ్యక్షుడు పోతుగుంట అనీల్ మాట్లాడుతూ ఈ పోటీలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయని చెప్పారు. ఇందుకు దోహదం చేసిన మండల విద్యాధికారి బాబ్జీ, పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రఫీ, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం విద్యార్థులకు ట్రోపీలతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లు లయన్స్ సభ్యులు అందించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిస్పేషన్ సర్టిఫికెట్లతో గౌరవించారు. ఈ మేరకు బహుమతులు అందుకున్న వారిలో అండర్ 7 లో గోల్డ్ మెడల్ శశాంక్ చౌదరి, సిల్వర్ మెడల్ చరణ్ తేజ్ రెడ్డి, అండర్ 9 గోల్డ్ మెడల్ చికిత్ రాయల్, సిల్వర్ మెడల్ రుత్విక్ రెడ్డి, అండర్ 11లో గోల్డ్ మెడల్స్ జి ఇషాన్ రాయల్, సిల్వర్ మెడల్ ఏ మోహిత్ రాజ్, ఇ సంతోష్ లకు, బ్రాంజ్ మెడల్ పి పవాజ్, అండర్ 13లో గోల్డ్ మెడల్ శ్యాశి బేబీ, సిల్వర్ మెడల్ సృజన్, ఎ విజయ్ చరణ్ లకు, బ్రాంజ్ మెడల్ పి సాత్విక్, అండర్ 15లో గోల్డ్ మెడల్ ఎన్ హరినాథ్, సిల్వర్ మెడల్ హర్షవర్ధన్, జి ధీరజ్ లకు, బ్రాంజ్ మెడల్ డి సాయి తన్మయి ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాకాల సెక్రటరీ మారసాని మహేష్ బాబు, ట్రెజరర్ మారసాని నాగేంద్ర, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు ధనంజయ, సహచర మండల అధ్యక్షుడు జశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి