హోండా హితోక్తి:- - యామిజాల జగదీశ్
 "టయోటా సంస్థ వారు నన్ను తిరస్కరించినప్పుడు ఒకింత బాధపడినా అది వాళ్ళు నాకు ఇచ్చిన అత్యుత్తమ బహుమతిగా భావించాను" అని సోయిచిరో హోండా తెలిపారు.
సోయిచిరో హోండా పయనం గురించి ఆయన మాటల్లోనే...
"నేను నా మొదటి పిస్టన్ డిజైన్‌ను చూపించినప్పుడు, అది సరిపోదని వారు చెప్పారు. అది వారి ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నారు. మరౌ ఆలోచన లేకుండా వారు నా తలుపు మూసేశారు. అందుకు తొలుత కొంత బాధపడినా నేను నా ప్రయత్నాన్ని వదులుకోలేదు.  నేను నా వర్క్‌ షాప్‌ కి వెళ్లి మళ్ళీ నా కృషి కొనసాగించాను. నా ఆలోచనకు నిధులు సమకూర్చుకోవడానికి నా దగ్గర ఉన్నవన్నీ అమ్మేయాల్సి వచ్చినాసరే తప్పుకోలేదు.
తర్వాత యుద్ధం...బాంబు దాడులు... భూకంపం... మొత్తం ప్రపంచం నన్ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది.... కానీ నన్ను విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, అది నన్ను నిలబెట్టింది... నా దగ్గర ఉన్న దానితో నిర్మించడం నేర్చుకున్నాను, ప్రజలు కదలగలిగేలా సైకిళ్లపై ఇంజిన్‌లను అమర్చడం నేర్చుకున్నాను. ఏమీ లేకుండా, నేను ఊహించిన దానికంటే చాలా గొప్పది పుట్టించాను.
హోండా ఒక కంపెనీగా ప్రారంభం కాలేదు. ఇది తిరస్కరణకు ప్రతిస్పందనగా ప్రారంభమైంది. ప్రతి ఎదురుదెబ్బ నన్ను బలపరిచింది. ప్రతి అడ్డంకి ముందుకు సాగడానికి ఇంధనంగా మార్చడాన్ని గుర్తు చేసింది
కాలక్రమేణా, మేము సైకిళ్ల నుండి మోటార్‌సైకిళ్లకు, మోటార్‌సైకిళ్ల నుండి కార్లకు, జపాన్ నుండి మొత్తం ప్రపంచానికి మారాము.  "కాదు" అని మొదలైనది "అవును" గా మారి అది చరిత్రను మార్చివేసింది. కనుక నేను చెప్పగలిగింది ఇదే...
లో ఒక తిరస్కరణతో కృంగి పోకూడదు. అదే ముగింపుని అనుకోకూడదు.  అది మీ ప్రారంభానికి ఇంధనంగా ఉండనివ్వాలి. దృఢసంకల్పంతో ముందు సాగాలి" 
సోయిచిరో హోండా హితోక్తి నిజమేగా.

కామెంట్‌లు