పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేసాడు. పూరుని కుమారుడు జనమేజయుడు,అతని కుమారుడు ప్రాచిన్వంతుడు,అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహంయాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిధి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనేకుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు.
శకుంతలా దుష్యంతుల పరిచయం
దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలనూ వేటాడి పట్టుకుంటూ ఆడుకొనేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు. ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది బద్ద శత్రువులైన సింహాలూ ఏనుగులూ లాంటి జంతువులనేకం కలసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్ధం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతల ను చూసాడు. ఆమె అందానికి ముగ్ధుడైయ్యాడు. శకుంతలనూ దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయా లయ్యాక ఆమె కణ్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు
మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం-శకుంతల జననం
రాజర్షి విశ్వామిత్రుడు ఒకానొకసారి ఘోర తపమాచరిస్తున్నాడు. అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు. దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది. జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తరవాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్నబిడ్డవలె చూసుకున్నాడు
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి