ముందుమాట == : - వారాల ఆనంద్

 
 ప్రతి మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైన దశ. ఆ సమయంలో నేర్చుకునే అనేక  విషయాలు, తెలుసుకునే సంగతులు, పొందే అనుభవాలు ఎంతో గొప్పవి. అవి మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, భవిష్యత్‌ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. పాఠశాల విద్య బాల్యంలో నేర్చుకునే మూలభూతమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది.
పాఠశాలలో చదివే పాఠ్యాంశాలు విద్యార్థుల జ్ఞానాన్ని పెంచుతాయి. అయితే, పాఠశాల అనేది కేవలం పుస్తకాలను చదివే స్థలం కాదు. ఆటపాటల ద్వారా, ప్రయోగాల ద్వారా, కథల ద్వారా మనం అనేక కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకుంటాము. గణితం సమస్యలు పరిష్కరించడం, విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు చేయడం, కళలు అభ్యసించడం ద్వారా మనలో సృజనాత్మకతకు అక్కడే బీజం పడుతుంది అంతేకాదు పెరుగుతుంది కూడా. అప్పుడు ఆడే క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా సహకారం, నియంత్రణ వంటి విలువలు కూడా పెరుగుతాయి.
పాఠశాలలో పొందే అతి గొప్ప అనుభవాల్లో స్నేహాలు ముఖ్యమైనవి. కలిసి ఆడుతూ, కలిసి చదువుతూ, ఇతరులతో పంచుకుంటూ జీవించడం నేర్చుకుంటాం. సహనం, గౌరవం, నాయకత్వం వంటి లక్షణాలు కూడా ఇక్కడే పెరుగుతాయి. గ్రూప్ ప్రాజెక్టులు, చర్చలు, ఉత్సవాలు ద్వారా పరస్పరం సహకరించడం, ఇతరులను అర్థం చేసుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలను పెంచుకునే అవకాశం అక్కడే లభిస్తుంది.
అట్లని పాఠశాల జీవితం ఎల్లప్పుడూ అంత సులభంగా ఉండదు. పరీక్షల ఒత్తిడి, తోటి విద్యార్థుల ఒత్తిడి, స్వీయ సందేహాలు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే ఇవే జీవితంలో ముందడుగు వేయడానికి కావలసిన ధైర్యాన్ని, ఓర్పును, అనుకూలతను ఖచ్చితంగా నేర్పుతాయి. గురువులు స్నేహితుల సహకారంతో ఆ కష్టాలను అధిగమించడం అందరమూ స్కూలులోనే నేర్చుకుంటాము. మేము చదివిన కాలంలో కంటే కూడా ఇవ్వాళ దాదాపు అన్ని పాఠశాలల్లో పిల్లలలోని ప్రతిభను వెలికితీయడానికి ఎన్నో వేదికలను ఏర్పాటుచేస్తున్నారు. అక్కడే సంగీతం, నృత్యం, నాటకం, కవిత్వం వంటి కార్యక్రమాల్లో పాల్గొని పిల్లలు తమ వ్యక్తిత్వాన్ని, భావాలను వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో పోటీలు, కార్యక్రమాలు వారి నైపుణ్యాలను మెరుగుపరచడమే కాకుండా, తాము చేసిన పనిపై గర్వపడే అవకాశం కూడా కల్పిస్తాయి.
పాఠశాలస్థాయిలోనే విద్యతో పాటు నైతిక విలువలు కూడా అందుతాయి. నిజాయితీ, బాధ్యత, దయ, ఇతరులను గౌరవించడం వంటి మంచి లక్షణాలను పిల్లలకు ఉపాధ్యాయులు బోధిస్తారు. ఇవే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి.
పాఠశాల రోజులలో గడిపిన ప్రతి క్షణం మనసులో నిలిచే జ్ఞాపకంగా మారుతుంది. తరగతి గదిలో జరిగిన సరదా సంఘటనలు, పర్యటనలు, వార్షికోత్సవాలు, గురువుల ప్రేమl ఇవన్నీ జీవితాంతం గుర్తుండే మధురమైన అనుభవాలుగా మారుతాయి.
నా స్కూలు  జీవితం కరీంనగర్ లోనే గడిచింది. ప్రాథమిక స్థాయి విద్య ఇంట్లోనే పూర్తి చేసుకున్న నన్ను మా నాన్న 1967 లో ఆరవ తరగతిలో ఖార్ఖానగడ్డ హై స్కూల్ లో చేర్పించారు. 
అక్కడ 6 అండ్ 7 తరగతులు చదివాను. ఆ స్కూలు అనగానే హిందీ చెప్పిన ఠాకూర సింగ్ సారు, కలిసి చదువుకున్న నరేందర్, రాధ తదితరులు గుర్తొస్తారు. కార్ఖానా గడ్డ బడిలో ఏడవ తరగతి అయ్యాక COMPOSITE MATHEMATICS కోసం గంజ్ హై స్కూలుకు మారి 8 వ తరగితిలో చేరాను. అప్పుడు నా విద్యార్థి జీవితంలో కొత్త అధ్యాయం మొదలయింది. ఎదుగుతున్న క్రమంలో కథలు కవితలు రాయడం రాయడం ఆరంభించాను. నా 25 వ పుస్తకం ‘త్రివేణి’ని  నేను చదివిన స్కూల్లో విద్యార్థుల మధ్య ఆవిష్కరించుకోవాలనిపించినప్పుడు మా చిన్నప్పటి హిందీ సార్ శ్రీ ఉడుత రాజేశం గారు గుర్తొచ్చారు. వారి అబ్బాయి డాక్టర్ chandrasheka చంద్రశేఖర్ ను సంప్రదించాను నాన్న వీల్ చైర్ లోనే వున్నారు .కానీ మీ పుస్తక ఆవిష్కరణ కోసం తీసుకొస్తాను అన్నారు. స్కూల్లో ఎవరున్నారు అని తెలుసుకుంటే కవి మిత్రుడు  శ్రీ నంది శ్రీనివాస్ అక్కడే ఉపాధ్యాయుడిగా వున్నారని తెలిసి ఆనందంగా ఆయన్ని సంప్రదించాను. ఎంతో ఉత్సాహంగా రండి అన్ని ఏర్పాట్లు చేస్తాను అన్నారు. పెద్దగా ఆడంబరాలు ఏమీ వద్దు ఒక క్లాసులో ఆవిష్కరిద్దామన్నాను. మీరు రండి అన్నారు. తర్వాత అక్కడి ప్రదాన ఉపాధ్యాయులు తెలుగు శాఖ ఇతర అధ్యాపకులు స్పందించారు. అట్లా ఈ కార్యక్రమం మొదలయింది. ఇప్పుడు అయిదు దశాబ్దాల కాలం గడిచాక సెప్టెంబర్ ఒకటిన ఆ స్కూల్లో నా 25 వ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం గొప్ప ఉద్వేగంగానూ ఉత్సాహంగానూ గడిచింది. ఆవిష్కరణ తర్వాత విద్యార్థులతో ముఖా ముఖి వుంటుంది వాళ్ళు మెమ్మల్ని ప్రశ్నలు ఆడుగుతారు అన్నారు. నాకూ ఉత్సాహంగా అనిపించింది. అనేక మంది విద్యార్థులు అనేకానేక  ప్రశ్నలు.. నేనెమో  వార్షిక పరీక్షలో విధ్యార్తిలాగా సిన్సియర్ గా సమాధానాలు చెప్పాను. నిజానికి పిల్లలకు నేనేదో చెప్పాను అనుకుంటారు కానీ నేనే వాళ్ళ ప్రశ్నలతో ఎన్నోనేర్చుకున్నాను. పిల్లలలోని స్వచ్చత స్నేహభావం మొహమాటంలేని సూటితనం ఇలా ఎన్నో మళ్ళీ నా అనుభవంలోకి వచ్చాయి. స్మృతి మధురమయిన ఈ సందర్భాన్ని ఇట్లా మీతో పంచుకుంటున్నాను.. VERY EXCITED. విద్యార్థులకు అభినందనలు నిర్వాహకులకు  కృతజ్ఞతలు. 
-వారాల ఆనంద్

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice experience 👌