జీవనయానంలో...:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పిడికిలి మూస్తున్నా–
రహస్యాలు దాచటం కోసం.

నెత్తిన కప్పుకుంటున్నా –
ఆశలు సజీవంగానిలుపటం కోసం.

మాటలు విసురుతున్నా –
భావాలు వ్యక్తపరచటం కోసం.

తలను గీసుకుంటున్నా –
ఆలోచనలు పారించటం కోసం.

భుజాలు వంచుతున్నా –
బాధ్యతలు భరించటం కోసం.

బతుకుబండిని ఈడుస్తున్నా –
జీవితచక్రాలను దొర్లించటం కోసం.

చేతులను శ్రమపెడుతున్నా –
ఫలాలు పొందటం కోసం.

కాళ్లు కదుపుతున్నా –
గమ్యాలను చేరటం కోసం.

ఎత్తుకు ఎగురుతున్నా –
ఆకాశం అందుకోవటం కోసం.

మనసు విప్పుతున్నా –
ప్రేమను పంచుకోవటం కోసం.

నాకు అండగా నిలుస్తారా?
నా పయనానికి సహకరిస్తారా?

నన్ను ప్రోత్సహిస్తారా?
నాగుండెల్లో వెలుగులు నింపుతారా?


కామెంట్‌లు