ఎదురు చూసిన కబురేదో
ఎదకు అందిన తరుణంలో
ఎగసి పొంగిన మనసులా....
కుదురులేక తిరుగుతున్న
ఆలోచనలు ఆపేసే అరుదైన
చక్కని ఉహేదో తోచినట్టు
చెదిరిన కలల రూపు
కనుల ముందు నిలిచి
అందుకోమని చేయి చాచినట్టు
భయం చుట్టుముట్టి
బయట పడలేక బెంగపడ్డ
మనసుకు కొత్త ధైర్యం వచ్చినట్టు
దిగులు నిండి నీరసించి
సాయం కోసం చూసే మదికి
చేదుకునే చేయి దొరికినట్టు
చీకటి చేతికి చిక్కి
వ్యధలో నిండిన వసుధకు
కళకళ లాడించే పండగొచ్చినట్టు...
పెనుచీకటి కావల వెలిగి
ప్రభలను కురిపించి
పృథ్వికి వేంచేయు వేకువకు
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి