కావడి! అచ్యుతుని రాజ్యశ్రీ

మనకి కావడి తెలీదుకానీ పూర్వం భుజంపై కావడిబద్దకి రెండు కుండలు వేలాడదీసి చెరువునించి నీళ్లు మోసుకొచ్చేవారు. అలాగే పాలు పెరుగు కావడి కుండల్లో పోసి అమ్మేవారు. కష్టసుఖాలు కావడికుండలు అనే సామెత అలా వచ్చిందే. ఎడం భుజంపై కావడి కుండలు తాడుతో వేలాడేవి. ఇప్పటికీ  దైవారాధనలోఆ సాంప్రదాయం ఉంది.ముంబైలో శ్రావణమాసం  గటారీఅమావాస్యతో ప్రారంభం. యువతీ యువకులు భుజాలపై కావడి మోస్తూ గంగాతీరంనుంచి తమ గ్రామాలకు బైలుదేరుతారు.ఉత్తర భారత్ లో అప్పటినుంచి పండుగలు ప్రారంభమవుతాయి. కాలికి చెప్పులు లేకుండ  గంగాజలాన్ని కావడిలో తెచ్చి అమావాస్య రాత్రి కి తమపల్లెలోని శివలింగంపై అభిషేకిస్తారు.ఆకుండలు నేలను తాకరాదు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చెట్టుకి వేలాడేస్తారు.క్షీరసాగరమథనంలో శివుడు హాలాహలం మింగాడు. ఆబాధ పోటానికి కంఠంలో నెప్పి తగ్గాలనే ఆలోచనతో ఇలా శివాభిషేకం చేస్తారు.కావడి యాత్ర  లో వందలాది యువత బంబంభోలే అని పెద్దగా అంటూ నడుస్తారు. ఎరుపు కాషాయరంగులజెండాల్ని అలంకరించిన కావడులతో రోడ్లన్నీ కిటకిట లాడ్తాయి.శ్రవణకుమారుడు తన ముసలి అంధులైన అమ్మ నాన్నలను కావడిలో కూచోబెట్టి తీసుకెళ్లటం,దశరథుని బాణానికి ప్రాణం పోవటం మనకుతెల్సిన కథ.ఇక తమిళనాడులో మురుగన్ అనే మనం పిలిచే కుమారస్వామి కార్తికేయుని భక్తులు నెమలిఈకల్తో అలంకరించిన కావడితో వెల్తారు.కుమార స్వామి తండ్రి శివునిపై అలిగి కైలాసాన్ని వీడాడు.దక్షిణ దిక్కుకి వెళ్లిన ఆయనకి అమ్మ నాన్నలు గుర్తువస్తారు.శివ పార్వతులు రెండు కొండలను హిడింబా అనే రాక్షసుని చేత పంపుతారు.ఆతను కొండల్ని కావడిలో మోస్తూ బరువుమోయలేక కింద పెడతాడు. అలాపెట్టరాదని హెచ్చరిక ను మరిచాడు.కింద పెట్టిన కొండపై ఓబాలుడు కూచున్నాడు.ఆకాంక్ష పేరే పళని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.శివ మురుగన్ ఉపాసనలో కావడికి ప్రాధాన్యత ఉంది.కావడి ఈప్రపంచానికి ప్రతీక. కావడి మోయటం అంటే సంసారభారం మోస్తూ సమాజంలో సమస్యలు ఎదుర్కోవాలని సూచిస్తుంది ఈకథ🌷
కామెంట్‌లు