ఇదిగో మీ ఈ
భక్తకోటి బృందాన్ని
మీ ఏడు కొండలు
"ఎక్కించుమా"... స్వామి..!
ఓ ఏడుకొండల వాడా..!
ఓ వెంకటరమణా గోవిందా గోవిందా..!
కొండపైకి చేరి
మీ కోవెల చుట్టూ
ప్రదక్షిణలు చేసి
మిమ్మల్ని దర్శించి
భక్తితో పూజించి మీ పవిత్ర
పాదారవిందాలకు మాచే...
"మొక్కించుమా"...తండ్రీ..!
ఓ ఏడుకొండల వాడా..!
ఓ వెంకటరమణా గోవిందా గోవిందా..!
మాపై కసిబట్టి
బుసలు కొట్టి
కాలసర్పములవోలే
కాటువేయ సిద్దంగా ఉన్న
మా బద్ధశత్రువులను
మీ పాదాల కింద
"తొక్కించుమా"...కరుణామయ..!
ఓ శ్రీహరి...
ఓ శ్రీనివాస...
ఓ శ్రీశైల వాసా..
ఓ కోనేటి రాయుడా...
ఓ భక్తజన బాంధవా...
ఓ ఏడుకొండల వాడా..!
ఓ వెంకటరమణా గోవిందా గోవిందా..!
మా గుండెగుడిలో
మహిమాన్వితమైన
దివ్యమైన మీ మంగళకర
శుభకర సుందర శిల్పాన్ని
"చెక్కించుమా"...మా కులదైవమా..!
ఓ అనాధ రక్షకా...
ఓ ఆపద్భాందవా...
ఓ ఏడుకొండల వాడా..!
ఓ వెంకటరమణా గోవిందా గోవిందా..!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి