కార్తీకం: - కోరాడ నరసింహా రావు !
శివ కేశవు లిరువురునూ
   కలిసిన కాలమే కార్తీకం! 
 స్థితికరుడు లయకరుడు 
ముచ్చటించు నదియేమో !? కే శ వా

శివా వీరి భక్తిని నువు గాం చినావ...! 
 ముక్తి కొరకు ఎంతటి ఆరా టము వీరికి..!! 

కే శ వా...! నీ వెరుగని భక్తి యా నరులది..!! 
   తీరని పాపములు జేసి... 
    ఈ పూజలతో పోవునని
     భ్రమించుదురు...
మూర్ఖులు కద వీరు...! 

పూజలకన్నా నిర్మలపశ్చా త్తాపమె మిన్నయని... 
  పాపము లిక చేయని వా రెవరున్నారీ లోకములో...?! 

జాలి, దయ, కరుణలతో 
నిస్వార్ధ సేవా తత్పరత కన్న... 
   మిన్నయగు పూజలు, నోములు, వ్రతములు ఏమున్నవి లోకములో ?!?! 
  
వీరు తెలుసుకునే దెప్పుడో
 అలా నడుచుకునేదెన్నడో
        ******


కామెంట్‌లు