ఇటీవల హైదరాబాద్‌లో అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం వారు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త డా. చిటికెన కిరణ్ కుమార్‌ను డా. వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య తొలి పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా సిరిసిల్లలో స్థానిక సాహితీ మిత్రులు డా. కిరణ్ కుమార్‌కు ప్రత్యేక సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాదం, వెంగళ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.
వారు కిరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని రచనలు చేస్తూ సాహిత్యరంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి