పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు మహాత్మాగాంధీ సాహితీ కళా పురస్కారం లభించింది. ఈనెల రెండోతేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని పొందారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, త్యాగాలు, దేశభక్తిని చాటిచెప్పిన కవితలతో జరిగిన కవి సమ్మేళనంలో తిరుమలరావు అఖిలావనికాదర్శం అనే స్వీయగీతాన్ని ఆలపించి అందరి ప్రశంసలు పొందారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షులు ఈశ్వరి భూషణం, మీడియా ప్రతినిధి ఎస్.అమ్మూ బమ్మిడిల నిర్దేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ వేదికపై తిరుమలరావు పురస్కారానికి ఎంపికయ్యారు. తిరుమలరావును శ్రీశ్రీ కళావేదిక ఉత్తరాంధ్రశాఖ అధ్యక్షులు డా.డబ్బీరు గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనర్ బోగెల ఉమామహేశ్వరరావు, జిల్లా శాఖ అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు, తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు, తెరవే ప్రధాన కార్యదర్శి ఆర్.వి.రమణమూర్తి, టి.లింగరాజులు పురస్కార కిరీటం, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, పూలమాల, పుష్పగుచ్ఛాలతో పురస్కార ప్రదానం గావించి, ఘనంగా సత్కరించారు.
తిరుమలరావుకు మహాత్మాగాంధీ సాహితీ కళా పురస్కారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి