కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తన పాఠశాల పిల్లలకు టై, బెల్టులు, గుర్తింపు (ఐడి) కార్డులను కొనిచ్చారు. తన సతీమణి ఈర్ల సునీత సహకారంతో రూ. 6,500 విలువైన టై, బెల్టులు, గుర్తింపు (ఐడి) కార్డులను మంథనిలోని తన ఆప్త మిత్రుడు ఎంవిఆర్ వెంకటేష్ వద్ద నుంచి తెప్పించి గురువారం పాఠశాల పిల్లలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరేడ్ల సునీత మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పాఠశాల అభివృద్ధికి, పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, పిల్లల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించి వారిని విజ్ఞానవంతులను చేయుటకు ఆయన పరితపిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య చేస్తున్న విద్యారంగంతో పాటు ఇతర సామాజిక సేవలను ఆమె కొనియాడారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలో కంటే ఇంటి వద్దనే ఎక్కువ సమయం ఉంటారని, తల్లిదండ్రులు పిల్లల చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, పిల్లలకు చక్కటి విద్యను అందిస్తున్నామన్నారు. తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించి డబ్బులు వృధా చేసుకోవద్దని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినిలు మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, తల్లిదండ్రులు, మంద లక్ష్మీరాజయ్య, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
ఊషన్నపల్లి పాఠశాల పిల్లలకు టై, బెల్టుల వితరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి