పానీ పూరీ రకాలు :- - యామిజాల జగదీశ్
 పానీపూరి దుకాణంలో మెనూ ! చాలా ఆసక్తికరమైన పఠనం కోసం చివరి వరకు చదవండి...
1) పానీ పూరి -- రూ.10
2) స్పెషల్ పానీ పూరి - రూ.12
3) వెరీ స్పెషల్ పానీ పూరి - రూ.15
4) ఎక్స్‌ట్రా స్పెషల్ పానీ పూరి - రూ.18
5) డబుల్ ఎక్స్‌ట్రా స్పెషల్ పానీ పూరి - రూ.20
6) సండే స్పెషల్ పానీ పూరి - రూ.25 (ఆదివారం మాత్రమే).
ప్రతి పానీ పూరికి వేరే రుచి ఉందో లేదో పరీక్షించడానికి నేను ప్రతిరోజూ వివిధ రకాల పానీ పూరి తినడం ప్రారంభించాను...
కానీ అందరూ ఒకే పానీ పూరిని రుచి చూస్తారని నేను త్వరలోనే కనుగొన్నాను.
చివరగా ఒక రోజు నేను అతనిని ఒకే రుచికి కారణం అడిగాను...
"పానీ పూరి వాలా" ఇలా అన్నాడు : 
పానీ పూరి ధర... . . రూ. 10!
స్పెషల్ పానీ పూరి అంటే కడిగిన చెంచాలు !
చాలా స్పెషల్ పానీ పూరి అంటే కడిగిన చెంచాలు, ప్లేట్లు!
ఎక్స్‌ట్రా స్పెషల్ పానీ పూరి అంటే కడిగిన ప్లేట్లలో పానీ పూరిని వడ్డించే ముందు చేతులు కడుక్కోవడం!
డబుల్ ఎక్స్‌ట్రా స్పెషల్ పానీ పూరి అంటే శుభ్రమైన తాగునీరు విడిగా ఇవ్వటం!
పానీ పూరి వాలా ఇప్పుడు నా వంక చూస్తూ పానీ పూరీ రకాలు అర్థమైందా అని అడిగాడు.
అప్పుడు నేను "ఆదివారం స్పెషల్" ఏమిటీ అని అడిగాను?
పానీ పూరి వాలా ఇలా అన్నాడు :
"ఆదివారం... నేను స్నానం చేస్తున్నాను...!!"
- తమిళంలో నాకొక మిత్రుడు పంపగా అనుసృజించానంతే. ఇది సరదా కోసమే తప్ప నిజం కాదనుకుంటాను.



కామెంట్‌లు