ఆ పాఠశాలో 8వ తరగతిలో కొత్తగా చేరింది శ్రుతి. తన నాన్నకు ఉద్యోగరీత్యా వేరొక ప్రాంతానికి బదిలీ అయినందు వల్ల ఆ కుటుంబం మొత్తం ఊరు మారవలసి వచ్చింది. శ్రుతి తెలివైన అమ్మాయి కాదు. మరీ వెనుకబడిన విద్యార్థిని కూడా కాదు. సగటు విద్యార్థిని. 8వ తరగతిలో కొత్త ఉపాధ్యాయుల బోధన కొత్తగా అనిపించి అర్థం చేసుకోలేకపోతుంది శ్రుతి. ఆ తరగతిలో మొదటి ర్యాంకు వచ్చే వందన వద్దకు చేరింది శ్రుతి. తనకు అర్థం కాని విషయాలు వివరించమని వేడుకుంది. తనకు టైం వేస్ట్ తాను నిరంతరం చదువుకోసమే కేటాయించాలి తన వద్దకు రావద్దని పొగరుగా చెప్పింది వందన. ఒకరోజు తెలుగు ఉపాధ్యాయులు పాఠం చెబుతుంటే ఆసక్తిగా విన్నది శ్రుతి. ఆ తర్వాత వందన వద్దకు చేరి, "అక్కా! గురువు గారు చెప్పిన పాఠంలో 'ఓడలు బండ్లవడం' అంటే అర్థం కాలేదు. అర్థం అయ్యేటట్లు చెప్పక్కా ప్లీజ్!" అన్నది శ్రుతి. "ఎన్నిసార్లు చెప్పాలి. నా టైం వేస్ట్ చేయవద్దని. ఒక్కసారి చెపితే అర్థం కాదా? మొద్దావతారం. పో." అని కఠినంగా అంది వందన. పక్కన ఉన్నవారు ఫక్కున నవ్వారు. అవమానంతో ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది శ్రుతి.
శ్రుతి పరిస్థితి కళ్ళారా చూసిన లయ అనే అమ్మాయి శ్రుతి వద్దకు వచ్చింది. శ్రుతిని ఓదార్చింది. "మనిద్దరం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్. సరేనా?" అంది లయ. సరేనన్నది శ్రుతి. లయ క్లాస్ ఫస్ట్ కాకున్నా మంచి తెలివైన అమ్మాయి. ప్రతిరోజూ శ్రుతిని తన పక్కనే కూర్చోబెట్టుకుంటుంది. అర్థం కాని విషయాలు వివరించి చెబుతుంది. "ఇంట్లో అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఏరోజు పాఠాలు ఆరోజు చదువుదాం. అనుమానాలు వస్తే ఉపాధ్యాయులను అడుగుదాం. ఏకాగ్రతతో పాఠాలను వింటే మనకూ తిరుగు ఉండదు. సరేనా?" అన్నది లయ. శ్రుతిలయలు ఇద్దరూ సమష్టికృషితో చదివి తెలివైన విద్యార్థులు అయినారు.
రాను రాను వందన తీరిక సమయంలో సెల్ ఫోన్ చూడటం ఎక్కువైంది. సెల్ చేతిలోకి వస్తే ఆ మత్తులో పడి గంటలూ పూటలూ సమయం వృథా చేస్తుంది. చదవడానికి సమయం తగ్గుతుంది 9వ తరగతిలోకి వచ్చేసరికి వందన రెండవ ర్యాంకుకు దిగజారింది. అయినా బాధపడలేదు. సెల్ ఫోన్ల వ్యసనం శ్రుతి మించింది. 9వ తరగతి ముగిసేనాటికి వందన చదువు కృష్ణపక్ష చంద్రునిలా సన్నగిల్లింది. శ్రుతిలయల చదువు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతుంది. ఇప్పుడు వారి చదువు పూర్ణ చంద్రునిలా నిడుగా ఉంది.
ఇప్పుడు వారు 10వ తరగతికి వచ్చారు. శ్రుతిలయలు మొదటి ర్యాంకుకు పోటీ పడుతూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. వందన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి, తన కూతురి చదువు గురించి బాధపడ్డారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు వందనను తెలివైన అమ్మాయిని చేసే బాధ్యత తెలివైన అమ్మాయి చేతిలో పెట్టాలని అనుకుంటారు. వందన బాధ్యతను శ్రుతికి అప్పగించారు. శ్రుతి ఫక్కున నవ్వింది. అప్పుడు లయ ఇలా అంది. "ఇప్పుడు అర్థమైందా శ్రుతీ! 'ఓడలు బండ్లు కావడం అంటే.'" "అర్థమైంది లయా!" అంది శ్రుతి. "బండ్లు ఓడలు అయ్యాయి." అన్నారు తెలుగు ఉపాధ్యాయులు తిరుమలేశం. వందన సిగ్గుతో తల దించుకుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి