విద్యార్థులంతా మార్కుల కంటే మానసిక ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. ఈనెల పదోతేదీన ప్రపంచ మానసిక వారోత్సవాల సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జిల్లా కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అంపిలి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో విద్యార్థులంతా మానసిక శారీరక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని, ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు అనేక అంశాలు విశదీకరిస్తూ పెక్కు సూచనలు గైకొన్నారు. సంబంధిత నాటికల, రూపకాలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించారు. తమ తల్లిదండ్రుల అంచనాలను చేరుకోలేక ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో ధైర్యంగా విద్యార్థులంతా మెలగాలని ఆయన అన్నారు. ఏవిధంగా ఒత్తిడి నుంచి దూరం కావాలో ఆ సమయం లో ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు పొందాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కడుముతో నివగాం, కుంటిభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో కూడా నిర్వహించారు.
మార్కులకంటే మానసిక ఆరోగ్యానికే ప్రాధాన్యం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి