అష్టాక్షరీలు: - డా.కె.శైలజ

నీవు నేను మనమని 
కరముల పెనవేసి 
ఆజన్మాంతం ఒకటిగ 
కలిసి నడెచెదమా.

ధర్మార్థకామములలో 
దాటమేనాడనుచును 
దండల మార్చుకొనగ
కలిసి నడెచెదమా!

యలమర్తి మంజుల 

పట్టి చిటికిన వేలు! 
వేసినాం ఏడడుగులు! 
నీడగా నీవుంటే చాలు! 
తోడుగా నడయాడగా!

జల్లినారు అక్షింతలు!
దీవించేరుగా పెద్దలు!
ఎన్నో తీపి గురుతులు!
తోడుగా నడయాడగా!

పంతుల లలిత-నీలాంజన 

చిటికిన వేలు పట్టి
సప్త పదులు నడిచి
దంపతులైన సమయం
ఒకరికొకరు తోడు!
ఆకాశమంత పందిరి
భూదేవి ఒడిలో పెండ్లి
పెద్దల ఆశీర్వాదంతో
ఒకరికొకరు తోడు!

పి.సుభాషిణి

మంగళ వాయిద్యా లతో
వేద మంత్రాలు నడుమ
బంధు మిత్ర సమక్షంలో
కళ్యాణం కమనీయము!!

వధూవరులు ఇద్దరూ
చిటికిన వేళ్ళుపట్టి
హోమంచుట్టూ ప్రదక్షిణం
కళ్యాణం కమనీయము!!

రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి 

ఇరు చూపులు ఒకటై
ఇరు మనసుల బంధం
మమతల పూదోటగ
ఇరు జీవితాల బంధం

మామిడి తోరణాలతో
మంగళ వాయుద్యాలతో
పచ్చని పందిరి లోన 
ఇరు జీవితాల బంధం

శర్వాణి దోర్బల 

కలిసాయి జాతకాలు
కలిపారు  దేవతలు
కలిసి నడుద్దాం ఇక
కలకాలం అన్యోన్యంగా

సూర్యచంద్రుల సాక్షిగా
సూత్ర ధారణ చేయగా
సన్నికల్లు తొక్కగాను
కలకాలం అన్యోన్యంగా

కర్నేన జనార్దనరావు 

హైందవ సంస్కృతీయము 
అగ్నికి ప్రదక్షిణము 
వేదరీతి నియమము 
భారతీయ సప్తపది 

చిటికెన పట్టువేళ 
వధూవరులయ్యే వేళ 
ఇరు మనసుల హేళ 
భారతీయ సప్తపది

సరస్వతి నాగరాజన్

ఏడడుగుల బంధము
వివాహ పవిత్ర బంధం 
ఇరువురి జీవితాల
అగ్నిసాక్షి కలయిక

ఇరువురు నొకటైన
చక్కని సంసార బంధం
విడరాని అనుబంధం
అగ్నిసాక్షి కలయిక

డి. షాహినా

 ఏడు అడుగులతోనే
 పెద్దల దీవెనతోనే 
దైవం ఆశీర్వాదంతోనే
ఒక్కటైన పెళ్లిబంధం

వంటలు బంధువులతో
బాజా బజంత్రి లతో 
పెళ్లి మంత్రాల మధ్యలో 
ఒక్కటైన పెళ్లి బంధం

పేరి. భార్గవి.

స్త్రీ పురుషుల కలిపే
తోడు నీడ అనుబంధం 
అగ్నిసాక్షి తోడ బంధం
వీడని వివాహ బంధం.

ఇరు హృదయా లొకటై
నవ శోభల
 శోభిల్లే 
ఆత్మీయపు అను బంధం 
వీడని వివాహ బంధం.

వి విజయ శ్రీ దుర్గ

హృదయాల కలయిక
మొదటి స్పర్శ మధురం
.కొంచెం భయం తోటి
మొదటి మమత స్పర్శ

అమాయక ప్రేమ జంట
ముసి ముసి నవ్వులల్లో
.చిలిపి కళ్ళ చూపులు
మొదటి మమత స్పర్శ

పద్మావతి పొడిచేటి 

ఏడడుగుల నడక
చేయి విడని బాసట
ఇద్దరమూ తోడవగా
ఒకే మాట ఒకే బాట

తలంబ్రాలే సాక్ష్యముగా
ఊసులు పెనవేయగా
నీవూ నేను కలిసిన
ఒకే మాట ఒకే బాట

కాళీపట్నపు శారద 

కనిష్ఠికల మెలిక 
నిలకడకు ప్రతీక 
సున్నితబంధ సూచిక 
కళ్యాణోత్సవ వేడుక!

ముస్తాబయ్యెను వేదిక 
వధూవరుల చేరిక 
సప్తపదుల నడక
కళ్యాణోత్సవ వేడుక!

యామిని కోళ్ళూరు.

కొత్తజంట తోడునీడ 
కొత్తలోకం  కొత్తబంధం 
కొత్తరోజు కొత్త ఆశ 
జన్మ జన్మల వరము!

కలసిన మనసులు 
కలకాలం సంతోషాలు 
కలిసేలే అడుగులు
జన్మ జన్మల వరము!

పద్మావతి పి. 

మనసులు కలిసిన 
మంగళ శుభ వేళలో
చేయీ చేయీ కలిపిన 
ఏడడుగుల సంబంధం..!

ఒకరికి ఒకరైన 
తోడూ నీడైన జంటగా 
కలిసె అగ్నిసాక్షిగా 
ఏడడుగుల సంబంధం

డా.సి వసుంధర

చెయ్యి పట్టుకుంటే కాదు 
హృదయం పట్టుకోవాలి.
ఆలు మగలంటే విను
అర్ధ అర్ధ తత్వమేగా. 

పెళ్లంటే పెద్ద విషయం
ముళ్ళ పాన్పుగా చేయొద్దు
పూల పాన్పుగా చేసుకో 
అర్ధ అర్ధ తత్వమేగా.

ముద్దు వెంకటలక్ష్మి  

ప్రేమైక హృదయాలను 
కలకాలము దీవించే 
విశ్వాసభరిత బంధం 
పవిత్ర వివాహ బంధం.

పరివార వ్యవస్థను 
దృడతరముగ చేసే 
మధుర జీవన సూత్రం 
పవిత్ర వివాహ బంధం.

కాటేగారు పాండురంగ విఠల్

వేద మంత్రాల నడుమ
బంధు మిత్రుల మధ్యన
ఏకమైరి ఇరువురు 
జన్మ జన్మల బంధము!

చూపులు కలిసినవి
మనసులేకమైనవి
ఇది మురిపాల జంట
జన్మ జన్మల బంధము!

జి. మధు మురళి
     
ప్రేమాప్యాయత గంధము
అనురాగాల చందము
ఆత్మీయతా సుగందము
మూడు ముడుల బంధము

ఏడడుగుల గమనం
పసుపు తాడు బంధనం
జీవిత కాల పయనం
మూడు ముడుల బంధము

శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర

పట్టి చిటికెన వేలు
వేసిరి ఏడడుగులు
కలిసెను మనసులు
నిలవాలి కలకాలం

ఒకరికొకరు తోడు
బాగుంది కదా ఈ జోడు
జరిగె పెళ్ళి ఈనాడు
నిలవాలి కలకాల

కోరాడ నరసింహా రావు. 
   
మూడు ముడులను వేసి
ఏడడుగులూ నడచి
మొదలుపెట్టు దాంపత్యం
ఇదీ పవిత్ర బంధము ! 

ఈ భువిపై ఆదర్శము
భారతీయ వైవాహికం
ఇది హైందవ ఔన్నత్యం
ఇదీ పవిత్ర బంధము !

ఉమ శుభ ప్రసూన 

చిటికెన వేలు పట్టి 
ఒకరికొకరు తోడు
నడిచేటి మూడుముళ్ల
ముచ్చటయిన బంధము 

కలకాలము కలిసి
మెలిసి ఉండు బంధము 
ఆలుమగల బంధము
ముచ్చటయిన బంధము

బి. రామ సీతమ్మ

మూడు ముళ్లతో కలిసి 
ఏడడుగులు నడిచి 
ఏకమైన జంటకిది
ఏడేడు జన్మల బంధం 

ఇరువురి జీవితాలు 
ఒక్కటిగా సాగించేటి
సంసారమనే ప్రయాణం 
ఏడేడు జన్మల బంధం

M.v. పద్మావతి.kkd.

మూడు ముళ్ళతో ఏకము
సప్తపది తొక్కినదే
ఇద్దరి మనస్సుల్లోను
ఏడడుగులు వేసిన 

ఒక్కటైన ప్రమాణము
 అరుంధతి దర్శనము
జీవిత భాగస్వామితో 
ఏడడుగులు వేసిన

తెలికిచెర్ల రాజ కృష్ణ కామేశ్వర రావు

మనసులు కలవగా
ఒకరికొకరు తోడై
కలకాలం ఒక్కటిగా 
నిలిచే పవిత్ర బంధం!

పెద్దల అనుమతితో 
మూడుముడుల బంధంతో
ముచ్చటైన మనసుతో 
నిలిచే పవిత్ర బంధం!

జన్ను ఈశ్వరమ్మ 

చిటికెన  వేలుపట్టి 
ఏడడుగులు నడచి 
చూపులతో లయమైన 
ఏడేడు జన్మల బంధం 

ఒకరికొకరు తోడు 
చెరి స గ మై వర్ధిల్లు 
జన్మ జన్మల సంబంధం 
ఏడడుగుల బంధమే.

వనపర్తి గంగాధర్

చిటికెన వేలు పట్టి
ఏడు అడుగులు వేసి
ఆనందముగా జీవించే
నూరేళ్ళ బంధము పెళ్ళి!

మూడుముళ్ల బంధముతో
కలిసుండాలి నిరతం 
ఇదే కదా జీవితము 
నూరేళ్ళ బంధము పెళ్ళి!

డాక్టర్. షహనాజ్ బతుల్

బంధము ముడిపడిన.
వివాహం తో ఒకటైన.
ప్రేమతో పెనవేసిన
ఏడడుగుల బంధము.

అనురాగాల బంధము.
చిటికెన వేలు పట్టి,
అపురూపమైన బంధం.
ఏడడుగుల బంధము.

తాడేపల్లి అనంతలక్ష్మి

మనసున మనసైన
ప్రాణానికి ప్రాణమైన
నిర్మల బంధము, అదే
ఎన్నెన్నో జన్మల బంధం!

తొలిచూపున విరిసి
మంత్రాలతో ముడిపడి
స్పూర్తిగాను సాగునదే
ఎన్నెన్నో జన్మల బంధం!

రూపకర్త: కీ.శే. శివశంకర ప్రియ 
నిర్వహణ: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర

కామెంట్‌లు