శజ్ఞ్కర భగవత్పాదులు - కనకధారా స్తోత్రం:- నాగరాజకుమార్ .MVSS-8897 839 185-9963 936 021
 ఓం అర్ధనారీశ్వరాయ నమః
ఓం గృహలక్ష్మ్యై నమః
ఓం గ్రామలక్ష్మ్యై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః


శ్లోకం:
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || 5 ||*

తా.:
కారుమబ్బుపైన కనిపించే మెరుపు తీగ లాగా, నీలవర్ణుడైన నారాయణుని వక్షస్థలము పైన ప్రకాశించు చున్నది, మూడు లోకాలకు తల్లి గా, ఎంతో గొప్పది అయిన లక్ష్మీ దేవి యొక్క కరుణా పూరిత చూపులు నాపై ఎల్లప్పుడూ నిలిచి యుండును గాక !
భావము:
అమ్మా! నల్లగా ఆవరించిన మబ్బుల మధ్య నుండి ఒక తెల్లని మెరుపు తీగ మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. అలాగే, నల్లని వాడైన నారాయణుని గుండెలపై వాలిన నీవు, మెరుపు తీగ కంటే అందంగా ఉన్న నీవు, మాకు ఆనందానుభూతి కలిగిస్తున్నావు. నీవు ప్రపంచం మొత్తానికి అన్నింటినీ ఇచ్చే అమ్మవు. చాలా శక్తివంతమైన దానివి. నీ భక్తుడను, నిన్నే తప్ప ఇతరులను తెలియని వాడిని అయిన నామీద, నీ చల్లని కరుణా కటాక్ష చూపులను ఎల్లప్పుడూ  వుంచు, కరుణామయీ, జగద్ధాత్రి !!
....... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు