భక్తి గీతం : - వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
 ప: 
కరుణించు కాత్యాయనీ… అంబా… 
 కమలనయనవు ఈశ్వరీ… 
 పాలించు పరమేశ్వరీ… మాయమ్మ 
 మణిద్వీప పుర వాసినీ… 
 ॥ కరుణించు॥ 
 1చ: 
కామితములీడేర్చగా..వచ్చిన 
 కనకదుర్గవు కామేశ్వరీ 
 కుంకుమార్చిత ప్రీతవూ… మాతా… 
 కలుషహారిణి కోమలీ…
 ॥కరుణించు॥ 
 2చ:
 శరణంటి శ్రీశాంభవీ… తల్లీ… 
 నీ చరణముల నే పట్టితీ…
 అర్పణము చేతుమమ్మా… పార్వతీ…
 మా పాపాలు పరిమార్చవే…
 ॥కరుణించు॥
 3చ:
 భోగభాగ్యములీయవే… మాలక్ష్మి 
 సిద్ధి బుద్ధులు పంచవే…
 విద్యాది దేవతవనీ… నిత్యమూ 
 మనమున స్మరియించితీ… 
 ॥ కరుణించు॥
 4చ:
 విజయవాటిక యందునా…
 దుర్గా వరముల ప్రసాదించవే… 
 వేలాది కీర్తనలతో… జననీ…
 స్తుతియించి తరియించితీ…
 ॥ కరుణించు॥ 


కామెంట్‌లు