"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
సృష్టి రహస్యాలను చూపించినది - "బ్రహ్మాండ పురాణం"
"బ్రహ్మాండ పురాణం" లోని"ఉపాఖ్యానాలు" - దేవకార్యాలను సవివరంగా చెప్తాయి - ఆ ఉపాఖ్యానాలలో ఒకటి శ్రీలలిత ఉపాఖ్యానము.
అగస్త్య మహాముని - శ్రీమహావిష్ణువు చేత సమర్ధుడు గా పొగడబడ్డ, మహా తపస్వి. శ్రీవిద్య ఉపాసించిన వారిలో, అగస్త్య మహాముని గొప్ప వాడు. అతి పూజనీయుడు.
వింధ్య పర్వతం...........పురాణకథ చూద్దాం.....
మన భారత దేశంలో ఎన్నో పర్వతాలు వున్నాయి. వాటన్నిటికీ రారాజు వంటిది వింధ్య పర్వతం. పర్వతాలన్నిటికంటే ఎంతో ఎత్తైనది, విశాలమైనది. అందమైన అడవులు, ఉద్యానవనాలు కలిగి వున్నది. పర్వతాలలో శ్రేష్టమైనది అని కూడా ప్రతీతి.
ఒక నాడు, ఈ వింధ్య పర్వతరాజుకు తన గొప్పతనాన్ని ఈ ప్రపంచం మొత్తానికి తెలియ చేయాలి అనిపించింది. అకస్మాత్తుగా, వున్నపళంగా, తన ఎత్తును, వైశాల్యాన్ని అనితరసాధ్యం గా పెంచేసాడు. అనేక ఫల పుష్ప వృక్షాలతో, జలపాతాల తో, లోయలతో మరింత అందంగా, ఎంతో రమణీయంగా కనిపిస్తున్నాడు.
తెల్లవారింది. సూర్యుడు తన సప్తాశ్వరధాన్ని ఎక్కి తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడు. వింధ్య పర్వతం దగ్గరకు వచ్చిన రధం ముందరకు వెళ్ళలేకపోతోంది. అసమాన్యంగా పెరిగిన వింధ్య పర్వతరాజు, సూర్యుని దారికి అడ్డుగా వున్నాడు. సూర్యరధం ఆగింది. జగత్తులో రాత్రింబగళ్ళు ఆగిపోయాయి. పగలు వున్నచోట రాత్రి అవటల్లేదు. రాత్రి వున్నచోట పగలు అవటల్లేదు. ఋషులు, బ్రాహ్మణులు సంధ్యావందనాలు చేయడం ఆగిపోయింది. లోకాలలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. తల్లడిల్లిపోతున్నాయి, లోకాలన్నీ.
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, దేవతలు, ఋషులు పరమాత్మ విష్ణుదేవుని తమ స్తొత్రాలతో, మంత్రాలతో పలుకరించారు. తమ గోడును విన్నవించుకున్నారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న విష్ణుమూర్తి, "ఈ పరిస్థితిని చక్కపెట్టగలవాడు ఒక్క అగస్త్యమునియే. అగస్త్యమునియే తన ఎత్తును, వైశాల్యాన్ని చూసుకుని విర్రవీగుతున్న వింధ్య పర్వతరాజుకు తగిన గుణపాఠం చెప్పగలడు." అని చెప్పి, దేవతలకు అగస్త్యుని కొరకూ ప్రార్ధించమని చెప్తాడు.
దేవతలు, ఋషులు అగస్త్యుని స్తుతించిన తరువాత లోకంలో ఉన్న పరిస్థితిని వివరించి, తమనందరనూ కాపాడమని ప్రాధేయపడ్డారు. అగస్త్యుడు కూడా వింధ్య పర్వతరాజుకు గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుని, వింధ్యపర్వతం వైపుగా అడుగులు వేస్తాడు.
తనవైపు వస్తున్న అగస్త్యుని చూసాడు, వింధ్య పర్వతరాజు. సవినయంగా నమస్కారము చేసాడు, అగస్త్యుని మహిమ తెలిసిన వింధ్య పర్వతరాజు. పర్వతరాజు దగ్గరకు వెళ్ళిన అగస్త్యుడు, తాను, "కాశీ నుండి బయలుదేరి రామేశ్వరము మొదలైన దక్షిణ దేశ యాత్ర లో వున్నానని, తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే వంగి వుండమని" చెప్పాడు. అగస్త్యుని మాట వినకపోతే మొదటికే మోసం వస్తుందని, ఇంతకుముందు వున్న ఎత్తు కంటే ఇంకా తక్కువగా వంగి అగస్త్యునికి దారి ఇస్తాడు. కాలగమనం ఎప్పటిలాగే మారింది.
కాలగమనాన్ని కూడా శాసించగల సమర్ధత కలవాడు --- అగస్త్యుడు
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి