"సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
హయగ్రీవ - అగస్త్య సంవాదం - అగస్త్య మహర్షి ఆవేదన - అభ్యర్ధన
మనకు పాఠశాలలో ఐహిక పాఠాలు చెప్పే గురువు గారు, పాఠం చెప్పే వరుసలో ఒక విషయాన్ని కావాలని చెప్పకుండా దాట వేస్తారు. మన ఏకాగ్రతను పరీక్ష చేయడానికి. విద్యార్ధి అడగగానే, మళ్ళీ ఆ విడిచిన విషయాన్ని చెప్పడం మొదలు పెడతారు, గురువు గారు. ఇక్కడ అగస్త్యుని విషయంలో కూడా అలాగే జరిగింది అని మనం అనుకోవచ్చు.
కుంభ సంభవుడైన అగస్త్యుని, అభ్యర్ధన విని, హయగ్రీవ రూపంలో వున్న శ్రీమహావిష్ణువు ఇలా చెపుతున్నారు.....
"మహాసాధ్వి అయిన ఓ లోపాముద్ర భర్తా! అగస్త్య! నీవు నా అత్యంత ప్రియ భక్తుడవు. లలితా సహస్రనామములు అతి రహస్యమైనవే. కానీ, నువ్వు, ఎంతో అనునయంగా, భక్తితో కూడిన ప్రేమతో అడుగుతున్నావు, కదా. నీకు, ఆ రహస్యాతి రహస్యములైన శ్రీలలితా సహస్రనామములు చెపుతున్నాను, శ్రద్ధగా విను."
స్వామి ఇంకా ఇలా చెపుతున్నారు....."విద్యా రహస్యాలను మూఢులకు, దుర్మార్గులకు, పెద్దలంటే గౌరవము, భక్తి లేని వారికి, సమాజం గురించి ఆలోచించని వారికి చెప్పకూడదు. కాని, అగస్త్యా! నువ్వు, కాలకేయులను తుదముట్టించడంలోనూ, ఇల్వలుడు, వాతాపి లనుండి ప్రజలను కాపాడటం లోనూ, వింధ్య పర్వతం ఎత్తునూ, విస్తీర్ణాన్ని తగ్గించి కాలగమనాన్ని సరిచేయడం లోను, నీ సామర్ధ్యాన్ని వుపయోగించావు. నలుగురి మంచి కోరుకున్నావు. అన్నటికీ మించి, నువ్వు నా ప్రియ భక్తడివి. నీ వంటి వానికి, పరమేశ్వరి యందు భక్తి కలవానికి శ్రీలలితా సహస్రనామములు చెప్పాలి."
పరమేశ్వరి యందు, భక్తి, అచంచలమైన నమ్మకమూ, ఉచ్ఛారణలో తప్పులు పోకుండా చదవగలగటమూ, శ్రీలలితా సహస్రనామములు తెలుసుకోవడానికి ఈ లక్షణములు తప్పక వుండాలి. అటువంటి వారికి మాత్రమే శ్రీలలితా సహస్రనామములు చెప్పబడాలి.
మంత్ర విద్యలలో "శ్రీవిద్య", తంత్రములలో "శ్రీలలితా సహస్రనామములు", పురములలో అమ్మ నివాసము అయిన "శ్రీ పురము", శక్తులలో "శ్రీలలితా త్రిపుర సుందరీ", శ్రీవిద్యోపాసకులలో "శివుడు" లాగా కొట్లాది సహస్రనామాలలో "శ్రీలలితా సహస్రనామములు శ్రెష్టమైనవి. రహస్యమైనవి.
శ్రీలలితా సహస్రనామములు పారాయణ చేయడం చేత "శ్రీలలితా పరమేశ్వరి" ఆనందిస్తుంది.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి