వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
3. శ్రీమత్సింహసనేశ్వరి(అష్టాక్షరీ)
మూడవ నామ మంత్రము -
ఓం శ్రీమత్సింహసనేశ్వర్యై నమః
శ్రీలలితా పరమేశ్వరి సింహమును ఎక్కి, యుద్ధములో మహిషాసురుని చంపినప్పటి నుండి సింహాసనేశ్వరి అని పిలువబడింది, అమ్మ. మనలో వున్న తామస గుణాలకు, హింసాత్మక గుణాలకు సింహం సంకేతం అయితే, ఆసీంహాన్ని అధిరోహించిన పరమేశ్వరి, సింహాసనేశ్వరి అయ్యింది. ఆమెయే, "శ్రీమాత".
మహారాజులు, మహారాణులు తమ సభలలో కూర్చునే కుర్చీని "సింహాసనము" అంటారు. ఈ సింహాసనమునకు నాలుగు కోళ్ళపైన సింహాకృతులు నిర్మించబడి ఉంటాయి. దేవతలు కూర్చునే ఆసనమునకు, ఈ నాలుగు కోళ్ళతోపాటు, మధ్యలో ఐదవ కోడు కూడా వుంటుంది. సింహాసనములలో ఐదవ కోడు కలిగిన సింహాసనము అతి శ్రేష్టమైనది. ఇటువంటి శ్రేష్టమైన సింహాసనమును అధిష్టించినది కనక, అమ్మ శ్రీమత్సింహసనేశ్వరి అయ్యింది.
బ్రహ్మ, విష్ణుమూర్తి, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు - వీరు "పంచప్రేతలు", "పంచబ్రహ్మలు" అని పిలవబడతారు. ఈ ఐదుగురు అమ్మను అతి దగ్గరగా సేవించుకోవాలి అనుకుని, బ్రహ్మ, విష్ణుమూర్తి, రుద్రుడు, ఈశ్వరుడు వీరు నలుగురు అమ్మ సింహాసనానికి నాలుగుకోళ్ళుగా అయ్యారు. ఐదవ వాడైన సదాశివుడు, అమ్మ కూర్చునే పరుపుగా మారారు. ఇటువంటి పంచబ్రహ్మల కలయికతో ఏర్పడిన సింహాసనమును అధిష్టించిన పరమేశ్వరి "పంచబ్రహ్మస్థిత" అయినందున వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరమేశ్వరిని శ్రీమత్సింహసనేశ్వరి గా పిలిచారు.
జగత్తుకు తల్లి అయిన "అమ్మ"ను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం శ్రీమత్సింహసనేశ్వర్యై నమః అని చెప్పుకోవాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి