వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
5.దేవకార్యసముద్యతా(అష్టాక్షరీ)
ఐదవ నామ మంత్రము - ఓం దేవకార్య సముద్యతాయై నమః
మనకు ఏర్పడే కష్టాలను తీర్చే దేవతల కార్యాలను చేసిపెట్టడానికి ఉద్భవించిన పరమేశ్వరికి నమస్కారము. దేవతల కృపవలన వరములు పొంది, ఆ వర గర్వంతో మరల ఆ దేవతలనే బాధించే, భండాసురుడు, మహిషాసురుడు మొదలుగా గల రాక్షస సమూహాన్ని అంతం చేయడానికి వచ్చిన శ్రీలలితా పరాభట్టారిక, దేవకార్యసముద్యతా అని వశిన్యాది వాగ్దేవతల చేత పిలువబడింది.
చిదగ్నికుండ సంభూత అయిన శ్రీమాత, సాగరమథనంజరిపి అమృతాన్ని బయిటకు తీయడం లోనూ, భండాసుర, మహిషాసుర మొదలైన రాక్షస సంహారంలోనూ, ఇంద్రాది దేవతలు, నవ గ్రహములు గతులు తప్పకుండా వారి వారి పనులు చేయడంలోనూ తన అనుగ్రహ దృష్టి తో సహాయం చేయడానికి దేవకార్యసముద్యతా గా వెలసింది.
పంచభూతాల మేలి కలయికతో ఎర్పడిన శరీరాన్ని తన ఇల్లుగా చేసుకుని ఈ భూమి మీదకు వచ్చిన ఆత్మ, తన స్థాయి మరచిపోయి, కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలకు లొంగిపొయి, పరమాత్మకు దూరంగా జరుగుతుంది. అందువలన ఈ కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు మన పట్ల రాక్షసులతో సమానం. ఈ అవిద్య, అజ్ఞానము, అహంకారము, అనే లక్షణాలను మన నుండి తీసివేసి, మళ్ళీ మనల్ని తన చల్లని ఒడిలోకి చేర్చుకోవడానికి, దేవకార్యసముద్యతా గా మనకోసం ఉద్భవించింది. ఎంతైనా అమ్మ కదా! పిల్లవాడు చెడు మార్గంలో వెళుతుంటే చూస్తూ ఊరుకోలేదు.
జగత్తుకు తల్లి అయిన "అమ్మ"ను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం దేవకార్యసముద్యతాయై నమః అని చెప్పుకోవాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి