వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
5.దేవకార్యసముద్యతా(అష్టాక్షరీ)
6.ఉద్యద్భానుసహస్రాభా(అష్టాక్షరీ)
ఆరవ నామ మంత్రము -
ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః
ఉదయిస్తున్న సూర్యుని యొక్క సహస్ర కిరణాల కాంతి కంటే ఎక్కువ కాంతితో ప్రకాశించే జగన్మాతకు నమస్కారము.
రాక్షసుడైన తారకాసురుని బాధలు భరించలేక దేవతలు, యక్షులు, గంధర్వులు, ఋషులు, బ్రాహ్మణులు, శక్తి స్వరూపిణి అయిన పరమేశ్వరి కోసం ప్రార్థిస్తారు. చైత్ర శుద్ధ నవమి నాడు ఒక అనన్యమైన కాంతి పుంజములాగా, కోట్లాది సూర్యుల కాంతితో, మెరుపు తీగలాగా దర్శనము ఇస్తుంది అమ్మ. అలా ఒక్కసారిగా ప్రకటితమైన కాంతి పుంజాన్ని చూడలేక దేవతలు మొదలైన వారు కళ్ళు మూసుకున్నారు. అప్పుడు కనిపించిన కాంతికి, స్త్రీ రూపమూ లేదు. పురుష రూపమూ లేదు. అసలు ఏ రూపంలో వుందో కూడా అర్ధం కాలేదు. నెమ్మదిగా కళ్ళు తెరచిన వారికి, అతి లావణ్యం గా, ముగ్ధమనోహర తేజోరాశి గా, అందమైన శరీర సౌష్టవం తో ఒక స్త్రీ రూపం కనిపించింది. ఆమే లలితా పరాభట్టారిక. అప్పుడు దేవతాసమూహమంతా చేతులు ఎత్తి జయ జయ ధ్వానాలు చేస్తూ..."ఉద్యద్భానుసహస్రాభా" అని పిలిచారు. ఈ నామాన్నే వశిన్యాది వాగ్దేవతలు తాము రచించిన సహస్రనామాలలో వుంచారు. అదే, అమ్మకు 6వ నామము అయ్యింది.
అమ్మకు, "స్థూల రూపము", "సూక్ష్మ రూపము", "కారణ రూపము" అని మూడు రూపాలు వున్నాయి. అమ్మను మనముందు మనలాగే సశరీరంగా కూర్చుని వుంది అని వూహించుకున్నప్పుడు, అమ్మ "స్థూల రూపంలో" వుంటుంది. ఈ రూపానికి మనం శోఢసోపచార పూజలు చేస్తాము. "సూక్ష్మ రూపము"ను బీజాక్షర మంత్రాలతో ఆరాధిస్తాము. ఇక, "కారణ రూపము" - అతి సూక్ష్మంగా వుండి, మన కళ్ళకు కనపడదు. ఈ రూపాన్ని మనసులో ధ్యానించి ఆరాధించాలి.
బీజాక్షర మంత్రాలతో, స్థూల, సూక్ష్మ రూపములను, త్రికరణశుద్ధిగా ఆరాధిస్తే, జగన్మాత మన మనోనేత్రాలకు తప్పకుండా దర్శనం ఇస్తుంది.
ఉదయించే కోటి సూర్యుల సహస్ర కిరణ కాంతుల కంటే తేజోవంతమైన జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః అని చెప్పుకోవాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి