వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
6.ఉద్యద్భానుసహస్రాభా(అష్టాక్షరీ)
7.చతుర్బాహుసమన్విత(అష్టాక్షరీ)
ఏడవ నామ మంత్రము -
ఓం చతుర్బాహుసమన్వితాయై నమః
నాలుగు వేదములు, నాలుగు వర్ణములు, నాలుగు ఆశ్రమాలకు తానే మూలము అని చెప్పకనే చెపుతూ, నాలుగు బాహువులతో దర్శనమిస్తున్న జగన్మాతకు నమస్కారము.
అమ్మ యొక్క స్థూల రూపాన్ని తెలుసుకునే ప్రయత్నం లో, అమ్మను ఒక తేజోమూర్తి గా కోట్ల కొలది సూర్య కాంతుల కంటే దివ్యమంగళమైన కాంతిమూర్తి గా తెలుసుకున్నాము. ఉద్యద్భానుసహస్ర అని పిలుచుకున్నాము. ఈ ఏడవ నామం లో అమ్మను "చతుర్బాహుసమన్విత" అని పిలుస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు.
అమ్మ నాలుగు భుజాలను కలిగి కనిపిస్తోంది. పైని రెండు భుజాలు - "ధర్మం, అర్ధములకు"; క్రింది రెండు భుజాలు - "కామ, మోక్షాలకు" పట్టుకొమ్మలు గా ఉన్నాయి. ఋగ్, యజుర్, సామ అధర్వణ వెదముల రూపాలుగా కూడా ఉన్నాయి, అమ్మ నాలుగు భుజాలు. చాతుర్వర్ణాలు అమ్మ శరీరం నుంచి వచ్చాయి. ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము - ఈ నాలుగు ఆశ్రమాలకు పరమేశ్వరియే మూలము.
ఇక తరువాత చెప్పవలసింది -
"అంతఃకరణ చతుష్టయము"
మనో, బుద్ధి, చిత్త, అహంకారము*లు - ఈ నాలుగు తత్వాలు కలిసినదే *"అంతఃకరణ చతుష్టయము". గాలి, అగ్ని, నీరు, నేల, అకాశాలతో కలసినది"అంతఃకరణం".
లలితా పరాభట్టారిక సహస్రనామాలలో "ఆధ్యాత్మిక, బ్రహ్మజ్ఞానము" నిండి వున్నట్టు గానే, జగన్మాత స్థూలరుపంలో ఎంతో ముఖ్యమైన, రహస్యమైన తత్వము నిండి ఉంటుంది.
జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం చతుర్బాహుసమన్వితాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి