*****
"అవ్వా! అవ్వా!గియ్యాల పొద్దుగాల మా బల్లె సార్లు పార్థన సైమంలో పదో తరగతి మాలతక్కని పిలిచి మస్తు మెచ్చుకుండ్రు.గట్లనే చంద్రన్నను పిలిచి ఇగ నిన్ను బాగు పరిచేటోడు ఈ లోకంలో లేడురా! ఎట్లరా నాయినా! నువ్వెట్ల బాగుపడ్తవు?అన్నరవ్వా !గదేందో అదృష్టం, దురదృష్టం అంటె అస్సలు సమజవ్వలే గదెట్లుంటది? మా నాన్నను అడిగితే నువ్వైతె మంచిగ చెబ్తవన్నరు."
గప్పుడే వచ్చి అర్గుమీద కూసున్న అవ్వ తానకి వచ్చి అడిగింది ఏడో తరగతి చదువుతున్న పార్వతి.
అవునవ్వా! నాకు సుత ఎరిక గాలే గవ్వేందో? అంది భూలచ్మి.
"అయ్తే గీ కత సెప్త.గిదిన్నంక మీకే తెలుస్తది." అనంగనే పార్వతి దోస్తులు,బుడ్డోడు వచ్చి సుట్టూ కూసుండ్రు.
అనగనగ ఒక రాజ్జెం. గా రాజ్జెపు రాజు చానా మంచోడు.గాయన పెజల్ని కన్న బిడ్డల లెక్క చూసుకునేటోడు. గా రాజుకి బాగా సదువుకున్న పండితులంటె చానా చానా గవురం.గాళ్ళను పిల్పించి జనాలకి రామాయణం,బారతంల ఉన్న నీతి కతల ముచ్చట్లు చెప్పించి పజల్ని మరింత నీతిమంతులుగ తయారయ్యే యిదంగా చూసేటోడు.
గట్ల మంచి నీతి కథలు చెప్పే పండితులు ఇద్దరిలో ఒకాయన బీదాయన. మరొకాయన ఉన్నాయన. ఏదైనా ఇచ్చేటప్పుడు "బంతిల ఒలపచ్చం ఒతికె" చెయ్యొద్దని సమానంగ కాన్కలు యిచ్చి పంపేటోడు.మన్సుల బీద పండితునికి ఏదో ఒక రకంగా సాయం చేయాలని అన్కున్నడు. గట్ల ఓరోజు ఇద్దరు పండితుల్ని పిలిచిండు. పండితులిద్దర్కి చెరో గుమ్మడి కాయ ఇచ్చుకుంట బీద పండితుడికి ఇచ్చే గుమ్మడి కాయకి కన్నం బెట్టించి అందులో వజ్రాలు, మణులు,మాణిక్యాలు లోపలేసి మూయించిండు.పైకి సూట్టానికి రొండు ఒక్కలెక్కనె ఉన్నయి.
బీద పండితుడు గా గుమ్మడి కాయ నేనేం జేస్కుంట అమ్మితే ఓ నాల్గు రూపాయలన్న ఒస్తయి అన్కొని ఇంటికి పోతా పోతా ఓ సేటుగారి కొట్టుకాడికి ఎల్లి గుమ్మడి కాయ అమ్మి వచ్చిన నాల్గు రూపాయలతో ఉప్పు,పప్పు కొనుక్కోని ఎళ్లిండు.గా సేటు గీ గుమ్మడి కాయ తిండం కంటే దానం జేస్తే పున్నెమొస్తదని ఉన్న పండితున్ని పిలిచి కూసబెట్టి దానం జేస్తడు.
గా ఉన్న పండితుడు అబ్బ! గియ్యాల నక్కను తొక్కొచ్చినట్టుంది అన్కుండు.ఇంటికెల్లి బార్యతో ఓ గుమ్మడి కాయతో పులుసు కూర,ఇంకో గుమ్మడి కాయతో వడియాలు పెట్టమన్నడు.ఒకటి మంచిగ పులుసు బెట్టుకుని సుష్టుగ తిన్నరు. ఇంకో గుమ్మడి కాయ కోస్తుంటె అందుల నుంచి జలజలా వజ్రాలు మణులు మాణిక్యాలు రాలేతల్కి గిదంత బగవంతుడి దయ అన్కుంట మొగుడు పెళ్ళాలు మస్తు సంబుర పడ్డరు.
ఇంగ బీద పండితుడు గీ మణులు మాణిక్యాలతో సుకంగ ఉండేమో సూద్దామనుకొని మారు వేషంలో తిరిగిన రాజుకి బీద పండితుడు జేసిన పని వల్ల ఉన్న పండితుడు మరింత సొమ్మున్నోడు ఎట్లయిండో అర్థమైంది.గా బీద పండితుని తల్సుకొని పాపం ఇట్ల గాదు ఇంకో రకంగా సాయం జేద్దాం అన్కుని వజ్రాలు మణులు మాణిక్యాలు ఓ సంచిల బోసి మూటగట్టి గా పండితుడెల్లే దార్లె కనబడేట్టు ఏసిండు.
గా సైమంలో గా బీద పండితున్కి ఓ తిక్కల ఆలోచనొచ్చింది. "గీ దారి దినాం నడ్సేదే గద.కళ్ళు మూస్కుని నడ్వలేనా సూద్దాం" అన్కొని కళ్ళు మూసుకుని నడ్సుకుంట గా సంచిని దాటి ఎల్లి పోయిండు. గదంతా చెట్టు సాటున నిలబడి సూత్తున్న రాజుకి అర్తమైంది. ఉన్న పండితుడు అదృట్ట వంతుడు గట్లోంటోళ్ళని ఎవరూ చెడగొట్టలేరు.ఇంగ గీ బీద పండితుడు దురదృట్టవంతుడు గిట్లాంటోళ్ళను ఎవ్వలూ బాగు చెయ్యలేరు అన్కున్నడు.
అర్తమైందా పార్వతి బంగారూ! గందుకే మన పెద్దోళ్ళు "అదృట్టం సుత కల్సి రావాలి" అంటరు. గట్లనే మీ బల్లె మాలతి పరీచ్చలో ఇచ్చిన సైమాన్ని ,తనకి వొచ్చినవి వదలకుండ రాసి అదృట్టం కొద్ది జిల్లా తాయిలో ఫట్టొచ్చింది. గా చంద్రానికి మాలతి కన్న తెల్వున్నా ఎక్కడో బిసికింది.అదృట్టం కల్సి రాలేదు. గందుకే ఎన్కబడిండు. "ఇంగ మీకు గీ సామెత రేప్రేపు పెద్దయినంక ఇంక బాగ అర్తమైతది" అనంగనే...
భూలచ్మి "నాకు గిప్పుడే అర్తమైందే అవ్వా!తమ్ముడేమో మస్తు అల్లరి,లొల్లి జేస్తడు.అమ్మ తందామని వచ్చే తల్కి కామూష్ గ ఉంటడు. గట్ల చెయ్యబాకురా అని గట్టిగ అనే నన్ను జూసి నువ్వేనా గింత గనం అల్లరి జేసేదని వీపు మీద రెండట్టిస్తది.గిది ఆడి అదృట్టం,నా దురదృట్టం " అంటుంటె..అక్కడున్నోళ్ళకి,అవ్వకి, గదంత గోడ కాన్కొని ఇంటున్న భూలచ్మి తల్లికి నవ్వాగలేదు.గాళ్ళ నవ్వుల్ని జూసి భూలచ్మి రోషంతో "గిదే నా దురదృట్టం" అన్కుంట తలొంచుకుంది.
గిదండీ సంగతి!"అదృష్ట వంతున్ని చెడగొట్టేటోడు లేడు -దురదృష్టవంతున్ని బాగు పరిచేటోడు లేడు" అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి