రోజు మాదిరిగానే నేను పొద్దుగాలనే లేచాను, ఈరోజు బాలల దినోత్సవం కావడం వలన నాకు ఈ రోజు కంటే ఎక్కువ సంతోషాన్నిపించింది. ఉదయం 8 గంటలకే బడికి వచ్చాను. ఉదయం ఒక పూట మొత్తము క్లాసులు జరిగినాయి. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కూడ ఒక క్లాస్ జరిగింది. రెండో పిరియడ్ నుంచి అందరం పిల్లలను గ్రౌండ్లో కూర్చున్నాం. ముందుగా మా ఉపాధ్యాయులంతా నెహ్రూ గారి ఫోటో కి పూలతో సన్మానం చేశారు. తర్వాత ఈరోజు మా ప్రధానోపాధ్యాయులు గారు రాకపోవడంతో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వీరస్వామి సార్ నెహ్రూ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత గేమ్స తరగతి వారిగా విభజించారు. ఒక తరగతికి ఒక రకమైన ఆట ఆడించారు. ఆరో తరగతికి బెలూన్ గ్లాస్ గేమ్, ఏడవ తరగతికి స్ట్రా తో గ్లాసుల జోడించడం, 8వ తరగతికి స్ట్రా తో కాగితముక్కల ఏరి బౌల్లో వేయాలి, 9 10 తరగతి లకు డైస్ తో గేమ్ ఆడిపించారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి చాలా కొత్త రకమైన గేమ్స్ ఆడిపించారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత ఏడవ తరగతి అమ్మాయిలు, ఒక మిక్సింగ్ పాటకు చాలా బాగా డాన్స్ వేశారు. తర్వాత మా తరగతి అబ్బాయిలు జానపద గేయానికి చాలా చక్కగా డాన్స్ వేశారు. 9 10వ తరగతి అక్కలు మరో జానపద గేయానికి డాన్స్ వేశారు, చివరగా బడి పిల్లలందరం కలిసి ఒక పాటకు డాన్స్ వేసాం. ఈరోజు చాలా చాలా సంతోషం అనిపించింది. స్వర్గమా ఉపాధ్యాయులు అందరూ కలిసి తినడానికి మా అందరికీ సమోసాలు పెట్టారు, చాలా రుచిగా ఉన్నాయి. తిన్న పేపర్ ప్లేట్స్ అన్ని ఒక డబ్బాలో వేసాము. ఆ తర్వాత చేతులు కడుక్కొని కూర్చున్నాం. మా తరగతి అబ్బాయి నితిన్ ఒక మంచి పాట పాడాడు. ఆ తరువాత అందరం బెల్ కొట్టగానే అందరము ఇంటికి వెళ్లినాము. ఈ రోజు చాలా సంతోషం అనిపించింది.
మా పాఠశాలలో బాలల దినోత్సవం:- నందు,-6తరగతి, -జి. ప. ఉ. పా. అయిటిపాముల,-కట్టాంగూర్ మండల, నల్లగొండ.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి