సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
===============
జీవితమనే అపూర్వ స్వీయ గ్రంధంలో...
తొలి పేజీ నుంచి ఆఖరి పేజీ
అమూల్యమైనది...
అనుభూతుల మిళితమై...
అనుభవ పాఠాలను ప్రొధి చేసుకుని...
మీచే, మీ కొరకు మీరే రచించుకున్న జీవన గ్రంధంలో...
ఆఖరి పేజీలో ఉన్న ఆఖరి మజిలీ నిరంతరం స్మరణియం కావాలంటే....
పుణ్యకార్యాలను పుష్కాలంగా చేసి...
ఉన్న దానిలో ఉడుతలా సాయం చేసి...
మానవ సేవే మాధవ సేవగా తలచి...
సమాజ సేవలో జీవితాన్ని పునీతం చేసుకోవాలి!
ఘనంగా వీడ్కోలు మనస్ఫూర్తిగా పలుకేందుకు
ఆ నలుగురిని సమకూర్చుకోవాలి!
మనం లేకున్నా మనల్ని గూర్చి మంచిగా ఆ నలుగురూ చెప్పుకునేలా ప్రవర్తించాలి!
మన ప్రవర్తన ముందు తరం వారికి మార్గదర్శకమై నిలవాలి!
మనం వేసిన అడుగులు....
నలుగురు నడిచేందుకు ఆదర్శప్రాయమై మిగలాలి!
మనం మట్టిలో కలసినా...
మనం చేసే మంచి మనల్ని కలకాలం గుర్తుంచుకునేలా చేయాలి!
అందు కై మన ఆఖరి పేజీని
అధ్బుతంగా మలచి...
అనంతవాయువుల్లో మన జీవం కలిసేలా ఊపిరి వదలాలి!!!
ఆఖరి మజిలీ :- ఆళ్ళ నాగేశ్వరరావు - తెనాలి- చరవాణి :7416638823
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి