మాతృప్రేమకు ఖైది:- ఆళ్ళ నాగేశ్వరరావు-తెనాలి-చరవాణి:7416638823
 సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
చల్లని వెన్నెలనిచ్చే జాబిలమ్మలా/
దాహం తీర్చే జల దేవతలా/
పసిడి పంటలను పండించే పుడమితల్లిలా/
కీడు చేసే వారికీ మేలు చేసేలాంటి
సహృదయం గలది మాతృ హృదయం!/
పురిటి నొప్పులను పంటి బిగువుతో భరిస్తూ/
పొత్తి కడుపులో నీవు తన్నే తన్నులను ఆనందంగా అనుభవిస్తూ/
నీ తొలి కేకకై నిరీక్షిస్తూ/
తాను పునర్జన్మను పొంది /
నీకు జన్మను ప్రసాదించే ప్రతి సృష్టికర్త అమ్మ /
గుడి లేని దైవంగా అమ్మను పుట్టించాడు  బ్రహ్మ!/
అమ్మ హృదయం
అమృతపు గని /
మమతను పంచడమే ఆమె పని!/
తాను తిన్నా తినకున్నా
నీకు మస్తుగా పెట్టి తాను పస్తులుంటుంది /
తాను పడ్డ కష్టాలు నీవు పడకూడదని/
అందరి కన్నా మిన్నగా నీవు ఉండాలని/
హృదయ పూర్వకంగా ఆకాంక్షించే అమృతమూర్తి అమ్మ/
ఆమె సేవతోనే తరిస్తుంది ఈ మానవ జన్మ!/
మాతృ ప్రేమకు ఖైదీ కానివారెవ్వరు!?
అలాంటి వారేవ్వరైనా ఉంటే...
వాళ్ళే కలియుగ రాక్షసులు!!!
*********

కామెంట్‌లు