సుధామ చాలా అల్లరి పిల్లాడు. చదువు కంటే ఆటల మీదే శ్రద్ధ ఎక్కువ అతనికి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినాలంటే విసుగు వస్తుంది సుధామ కు. కానీ అతని ఆటలు అంటే ప్రాణం.ముఖ్యంగా క్రికెట్ అంటే చాలా ఇష్టం.
బడి వదలగానే బ్యాట్ పట్టుకొని మైదానం లోకి పరుగులు పెడతాడు. చీకటి పడే వరకు క్రికెట్ ఆడటం అతనికి అలవాటు.
అతన్ని తరగతి గది లో ప్రతీ రోజు పరిశీలన చేస్తున్న ఇంగ్లీష్ చెప్పే సుధాకర్ సార్ ,సుధామ ను ఒకరోజు దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు.
"నీకు క్రికెట్ అంటే ఇష్టం కదా! మరి చదువు అంటే ఎందుకు ఆసక్తి చూపించడం లేదు?" అని అడిగాడు.
"ఏమో సార్! చదువు నాకు అర్ధం కావడం లేదు.క్లాస్ లో కూర్చో బుద్ధి కావడం లేదు.ఇక నాకు చదువు రాదు సార్.నేను మొద్దు ని...."అంటూ బాధ పడ్డాడు సుధామ.
సుధామ భుజం పై చేయి వేసి, "బాధ పడకు! నీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా! నీకు బ్యాట్, బాల్ మరియు ఇతర క్రికెట్ కు సంబంధించిన సామాగ్రి కొనిస్తాను. వాటి తో నీ ఆట తీరు ఇంకా మెరుగు పరుచుకో..."అన్నాడు సార్.
సుధామ కళ్ళల్లో ఆనందం కనిపించింది.
క్రికెట్ కిట్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేసి మరింత మెరుగైన ఆట నేర్చుకున్నాడు సుధామ.
ఒక రోజు సుధాకర్ సార్ ,సుధామ ను పిలిచి ఇలా అన్నాడు
సుధామా..నువ్వు క్రికెట్ ఆటలో రోజు రోజు కీ నైపుణ్యాన్ని పెంచుకుంటున్నావు. అంటే శ్రద్ధ పెడితే ఏ విద్యలోనైనా రాణించవచ్చు అని అర్థం అవుతుంది కదా! మరి చదువులో కూడా ఇలాంటి శ్రద్ధ పెడితే చదువు కూడా బాగా వస్తుంది కదా! నువ్వు భవిష్యత్ లో మంచి క్రికెటర్ గా మారితే నువ్వు తప్పక మంచి చదువు చదివి ఉండాలి.ఇంగ్లీషు లో కూడా మాట్లాడటం .
తెలియాలి.ఇక నుండి నువ్వు ,చదువు లో కూడా ఇలాంటి శ్రద్ధ నే పెట్టాలి.ఆలోచించు..."
సుధామ కు ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు.
రాత్రంతా ఆలోచించాడు.
ఇక నుండి చదువు ను నిర్లక్ష్యం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
మరుసటి రోజు ఉత్సాహంగా బడికి వెళ్ళాడు. పాఠాలు బాగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అర్ధం కాకపోతే సార్ల ను, మేడంలను అడిగి తెలుసుకోవడం మొదలు పెట్టాడు.
కొంతకాలానికి చదువు లో మంచి ప్రగతి కనబరిచాడు.
సుధామ లో కలిగిన మార్పుకు ఉపాధ్యాయులు చాలా సంతోషించారు.
మార్పు ను తీసుకువచ్చిన సుధాకర్ సార్ కు కృతఙ్ఞతలు చెప్పాడు.
మార్పు:- నాయకుని సుశాంత్-8వ తరగతి-ZPHS.కామేపల్లి.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి