పటాకులు మాట్లాడుతున్నారు :- షేక్ హాజీ గౌస్ - ఖాజీపేట-వైఎస్ఆర్ కడప జిల్లా చరవాణి - 9000879589

 నేను చిన్న పెద్ద తేడా లేకుండా అరుస్తూ ఉంటా, మాయమవుతుందా! 
నన్ను పూలు మాదిరిగా అల్లుతారు! 
నేను అందరిని ఉలిక్కిపడేలా, భయపడేలా చేస్తా!
నన్ను విజయాలలో వాడుకుంటారు! 
నేను ప్రాణహాని ప్రాణాలు తీస్తాను! 
నేను జీవన ఉపాధిగా లక్షల కోట్లు సంపాదిస్తాను! 
నేను అనుకుంటే లక్షల కోట్లను బూడిద చేస్తాను, నష్టం చేస్తాను! 
నన్ను రాకెట్ లాగా ఉపయోగిస్తారు! 
నన్ను ఒక్కసారి గిల్లితే నా ప్రాణం పోయేంతవరకు గిల్లుతూనే ఉంటా! 
నేను ఆకాశంలో కొన్ని క్షణాలు మెరుస్తాను! 
నన్ను కొనాలంటే లైసెన్స్ ఉండాలి పర్మిషన్ తీసుకోవాలి! 
నన్ను దూరంగా ఉంచుతారు! 
ఈ మధ్యన రకరకాల అందాలతో తీర్చిదిద్దారు, రకరకాల పేర్లతో పిలుస్తున్నారు! 
నేను అరుస్తూ ఉంటే అందరూ చెవులు మూసుకుంటారు! 
నేను మెరుస్తూ ఉంటే అందరూ ఆనందంగా చూస్తారు! 
నన్ను దీపావళి పండుగ రోజునే ఉపయోగించుకోండి, ఆనందించండి!
నా పండగ రోజున భారతదేశ మొత్తం సెలవు ప్రకటిస్తారు, ఆనందంగా పండగ చేసుకోండి! 
నాతో జాగ్రత్తగా ఉండండి,అతి పనులు చేయకండి, నాతో ప్రాణాలు కాపాడుకోండి! 
నా వస్తువులు పండగ రోజు కొని ఆనందించండి! 
నన్ను తయారు చేయాలంటే కొన్ని వస్తువులు కొంత సమయం కావాలి! 
నేను ఆవిరి అయిపోవాలంటే కొన్ని క్షణాలు కావాలి! 
నాతో స్నేహం చేయకండి, బంధువులుగా  పిలవకండి నేను రాక్షసుడిని!
నా పేరు మీదుగా సహాయం చేయండి!
నేను మరణిస్తే మళ్లీ పుడుతాను,మీరు మరణిస్తే మళ్ళీ పుట్టరు!
గుర్తుంచుకో.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good