నేలకొరిగిన సాహితీ శిఖరం:-మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
మాయమవుతున్నాడమ్మా
మనీషన్నవాడు అంటూ
నేటి సమాజ దుస్థితి తెలిపిన
నవోదయుడు
మనిషి బతుకు చుట్టూ ఉన్న చీకటిని
తన గొంతునుంచి ఆశువుగా వల్లె వేసి
పాట రూపంలో పాడిన చైతన్య కారుడు

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి పాడిన
తెలంగాణా ఉద్యమ సూర్యుడు
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకమై
వెలుగు రేఖలను నింపిన ఉదయతేజుడు

తన గెయాలతో జన హృదయాలలో 
చిరస్థాయిగా నిలిచి పోయిన పాటసారి
చదువు కుంటెనే కవిత్వం కాదు
చదువుకు కవిత్వానికి సంబంధము లేదు
అని తెలిపిన బాటసారి
మా అందే ఎల్లయ్య
మా అందరి గుండెల్లో నీవయ్య

ఆ మహానుభావుని ఆత్మ శాంతించాలని 
అక్షర అశ్రునయనాలతో నివాళి
========================
మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218

కామెంట్‌లు