ఓటరు మేలుకో ;- మంజుల పత్తిపాటి- చరవాణి 9347042218
వస్తున్నాయి పంచాయతీ ఎన్నికలు 
వస్తున్నారు నవాబులు

నాయకుల మాటలు అందని
ద్రాక్షా గుత్తులు అని గుర్తుంచుకో
సాన పెట్టు నీ ధిమాకు

ముందు నుయ్యి  వెనుక గొయ్యి
కండ్లు తెరచి ఓటు వేయ్యి

మద్యానికి బానిసై భవిష్యత్
మరిచిపోకు
డబ్బుకు ఓటు హక్కును దాసోహం
చేయకు

నాయకుల మాయ మాటలు విని
ఆగమాగం కాకు అరిగోస  పడకు
దారి తప్పి బురద లో కూరకు

ఎన్నికల ముందు దండాలు పెడతారు
ఎన్నికల తరువాత మంట పెడతారు

ఇది కవిత కాదు కలత
ముందు తరాల బవిత

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ 
==================================
 మంజుల పత్తిపాటి-  చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Good message