బాలల దినోత్సవం -: డి వినాయక్ రావు , భైంసా-9440749686
కం: భారత  ప్రధాని నెహ్రూ
దారకులకు ప్రీతుడయ్యె తగులము జూపన్ 
ధీరుని జన్మదినంబున్
భారతమందయ్యె సలుప బాలలదినమున్

కం:బాలలు రేపటి పౌరులు 
పాలకులై దేశమేలు భవితంబందున్ 
శాలంబగు భరతమ్మకు 
మూలంబుగనిల్చు వారు  మోదము బంచున్ 

కం: పిల్లలు ముద్దగు ఇంటికి
నల్లరి జేయంగ యిల్లు హ్లాదముగుండున్
యెల్లలు తెలియని వారున్ 
యెల్లరినాకట్టు కొంద్రు యెలిమిని బంచన్ 

కం: జాతిని రక్షించెదరున్ 
నీతిగ బ్రతుకంగవారు నియమంబెంచన్ 
ప్రీతగు భారతి బుడుతలు 
చాతుర్యము నొంది జేయు సంత్రాణంబున్

కామెంట్‌లు