దుర్గా శతక పద్యాలు :- డి.వినాయక్ రావు, భైంసా, 9440749686
 
1. ప్రణమిల్లుదున్ భవానీ 
మనమును నీయందు నిల్పి మన్నననొందన్ 
ఘనమగు నీచరితనునే
వినిపించెదవినగ రమ్ము వేగన్ దుర్గా !
2.నవరాత్రులు నీవమ్మా 
నవవిద భక్తిన్ కొలిచెద నామది నిల్పిన్ 
భవమున్ నివ్వగ రామ్మా
నవదుర్గలరూపమెత్తి నవనిధి దుర్గా !
3.ప్రథముగ నీరూపంబట 
క్షితిభృత్తుకు పుత్రికయ్యి క్షేత్రమునందున్ 
సతతము నీనామము మా
మతియందుననిల్పుమమ్మ మా సతి దుర్గా!
4 రెండవ రూపము నీదిన్ 
మండలమగు భూమినందు మహిమాన్వితమున్
దండిగ మోక్షంబియ్యన్
చండీ నీజన్మ బహ్మచారివి దుర్గా !
5 మూడవ రూపము నీదట 
చూడాలమునందు యుండు చుక్కల దొరయున్ 
నీడగ ప్రజలన్ బ్రోవన్ 
గాఢత కలిగుండు చంద్ర గంటా దుర్గా!
6 రూపము నాల్గవదంట స్వ
రూపము కూష్మాండమంట లోకము పోలిన్ 
పాపములను బాపుదువట 
దీపము వెల్గందు కాల్చి దివ్వెల దుర్గా!
7 ఆకృతి నైదవదంటా
మా కృతి సమకూర్చ స్కందమాతగ యిలలో 
ప్రాకృతప్రలయంబాపు శు
భాకృతి కలిగుండుతల్లి పావని దుర్గా!
8 మహిషాసురమర్ధినివట
మహిలో జన్మించ షష్టి మాతగ నీవున్ 
మహిమలు నతీతమగునవి 
నహుషులమై యెర్గలేము నమ్ముము దుర్గా!
9 రాతిరి నధిదేవతగా 
రాతలు సరిదిద్దు కాలరాతిరినీవై
మాతగ సప్తమి దినమున
యాతన బాపగ జనించు నమ్మవు దుర్గా!
10 తెల్లని కాంతుల వెల్గును 
నల్లారుకు పంచ గౌరి నష్టమినాడున్ 
తల్లిగ జన్మొందగ తను
చల్లగ చూడంగవచ్చు ఛాయగ దుర్గా!

కామెంట్‌లు