దుర్గా శతకము :- డి.వినాయిక్ రావు, భైంసా, 9440749686

 21 చండుని ముండుని చంపను 
చండిగ నవతారమెత్తి చండాడితివే 
హిండివినీవేనమ్మా 
గండములను బాపిమమ్ము కాచుము దుర్గా!
22 శివములు నివ్వగ రామ్మా 
శివనీవై శీఘ్రముగను శివభక్తులకున్
భవసాగర మీదుటకై
భువరాణిగ సహకరించు మ్రొక్కుదు దుర్గా!
23 సర్వజ్ఞవు నీవె కదా
సర్వము నీదేగ తల్లి సర్వేశ్వరివే 
గర్వము త్రుంచగ మా లో
పర్వములాబ్రతుకునివ్వు వర నిధి దుర్గా!
24 కర్మములకు ప్రతినిధివి సు
కర్మలు చేయించి మాకు సుఖముల నిమ్మా 
కర్ములమమ్మా మేమిల 
కర్మను నమ్మంగ బ్రతుకు కను మము దుర్గా!
25 తీర్థము నీవేనని శర
ణార్థులు నీకడకు వచ్చు న్యాయము కొరకై 
తీర్థము నీదైనప్పుడు
నార్తులు నీబిడ్డలమ్మ నందరి దుర్గా!
26 భూమిజ నీవేనమ్మా
క్షామమురాకుండ చూడు క్షమ గల తల్లీ 
కామము పలింప జేయుము 
క్షేమంబగునట్టివైన శీఘ్రము దుర్గా!
27 దుర్గములను తొలగించుము 
నిర్గుణ మైనట్టి తల్లి నీడగనిలచిన్
వర్గములవి మాకుండును 
విర్గుట చూపించుమమ్మ వెజ్జుగ దుర్గా!
28 యష్ట భుజములందుండవి 
శిష్టుల రక్షింప యెపుడు 
శ్రేష్ఠాయుధముల్
కష్టములను బాపగ మా
పుష్టిగ నీవుండుమమ్మ పోషక దుర్గా!
29 యంత్రము నీరూపంబట
మంత్రము నీనామమంట మననము జేయన్
సంత్రాణంబగు రెండున్ 
మంత్రము యంత్రంబుమాకు మహిలో దుర్గా!
30 నిరహంకారివి నీవట 
హరసతివై నీకదెట్లు యబ్బెను తల్లీ
నరహంకారులమమ్మా
యెరుగము నీమహిమలన్ని యీశ్వరి దుర్గా!

కామెంట్‌లు