దేవుడున్నాడా ?:- డి.వినాయిక్ రావు , భైంసా, 9440749686

 దేవుడున్నాడని కొందరు 
ఉంటే కనిపించడెందుకని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు 
సృష్టి కర్తయే దేవుడని కొందరు 
కర్త తానైనప్పుడు కనిపించడెందుకని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు
మనిషిలో దేవుడున్నాడని కొందరు 
ఉంటే మానుషాందుడెందు కతనౌతాడని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు
ధీవుడికి రూపము ఉంటుందని కొందరు 
ఉంటే యెవరికి కనిపించాడని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు
మనసే దేవుడని  కొందరు 
మనసే దేవుడైతే అది మాయకు యెందుకు లోనవుందని మరికొందరు
వాదులాడుతూనుందురు అందరు
సత్యము దేవుడని కొందరు 
సత్య వాదికి కష్టాలెందుకని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు
ధర్మము దేవుడని కొందరు 
ధర్మాచారికి కష్టాలెందుకని మరికొందరు 
వాదులాడుతూనుందురు అందరు
కనపించేవి మిథ్య అని కనిపించని బ్రహ్మమే సత్యమని యెరిగిన నాడు 
దేవుడున్నాడని నమ్ముతారు అందరు .
"అహం బ్రహ్మాస్మి"
కామెంట్‌లు