ఆవె:సత్య సాయి బాబ సత్సంగమందున
సంగతుండు మంచి శాస్త్రముండు
సర్వజనులకదియు సంతృప్తి నిచ్చును
మంచిమార్గమెంచు మాటలుండ
ఆవె: బీద ధనిక నంటు భేదంబు లేదట
కులమతాల మాట తలచరచట
పెద్ద చిన్న యంటు భిన్నత్వమేలేక
నాశ్రయంబు నొందు నార్తులంత
ఆవె: ప్రజల వృద్ధికొరకు బాసటైనిలిచెను
సస్యమొంద నేలసలము నిచ్చి
దకమునిచ్చి బాబ దాహంబు తీర్చెను
సీమప్రజలకతను సిరులు బంచె
ఆవె: చదువుకొరకు బాబ స్థాపించె బడులను
బీద పాఠకులకు బోధనివ్వ
ఉచిత చదువు నిచ్చి నూతమైనిలవగన్
దీనపాటలికుల తీర్చిదిద్దె
ఆవె: ఆసుపత్రి కట్టి నాదుకొనెను బాబ
బాగుకోరి ప్రజల బంధు వయ్యె
వెజ్జరికమునొందు వివిదరోగములట
వరము లయ్యె నవియు వ్యాదితులకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి