స్నేహచలనం- కరచాలనం!:- డా పివిఎల్ సుబ్బారావు .-విజయనగరం.-94410 58797.
1.
ఎక్కడిదో ఈ తోట,
          ఏమిటి ఈ మాట!

కళ్ళ ముందు జంట ,
స్నేహానికి పండిన పంట! 

ఏకాదశ అవతారం, దుంపలజంటే అనుకుంటా!

ఒకరి ప్రాణం మరొకరిలో ,
ఉన్నట్టు ఉన్నారంట!

వారి కరచాలనం ,
స్నేహదేవత వింజామరం!

2.
మట్టి ఎంత గొప్పది? 

మనసుంటే దానికే ఉన్నది! 

మనకి అదే జన్మనిస్తుంది!

 క్రమేపీ పెంచి పెద్ద చేస్తుంది!

చివరికి  అక్కున చేరుస్తుంది!

పుట్టే  సృష్టి చివరికి ,
ఈ మట్టిలోనే కలుస్తుంది!

3.
వస్తుతీపి నోటికే పరిమితం! 

స్నేహం తీపి పరస్పరహితం! 

మనం అహం దాటి శివోహం! 

క్షణం క్షణం ఆనంద లోకం! 

ఆనందమే బ్రహ్మం స్వరూపం!
4
ప్రేమికులందరూ,
 లోకాన జీవించ గతించు! 

ప్రేమ మాత్రం అమృతమై,
తరతరాలకు జీవించు! 

మనుషులు వస్తూ ఉంటారు, పైకి పోతూ ఉంటారు!

కొందరు మరణించినా,
 తీపిగుర్తులై మిగిలి ఉంటారు!

కొందర్ని జీవిస్తన్నా లోకులు,
వారు మరణించారంటారు !
5
సృష్టి చిత్రాతిచిత్రం! 

విచిత్రాలు కడు సహజం! 

అందొకటి  నేడు మన,
 సమూహ సజీవ చిత్రం! 

ఏమా పరస్పర ఆత్రం,
 పలుకే మౌనగాత్రం! 

ఇదే జీవన అంతర్నేత్రం, బతుకు నడిపే సూత్రం!
_________


కామెంట్‌లు