(జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా)
==============================
నా పంచపదుల సంఖ్య---
1535.
అవిద్య అంధకారము ,
విద్య వెలుగు సుప్రభాతము!
జాతీయవిద్య ప్రగతి, సాధనము జనఆయుధము!
దేశసంక్షేమరథ పురోగమన, సరి ఇంధనము!
విద్యా విస్తరణతోనే సాధ్యం, సమాజ సంస్కరణము!
విద్య లేకుంటే బతుకు మిథ్య, తెలియాల్సిన సత్యము, పివిఎల్!
1536.
సమాజాన విద్యాభ్యాసము, జరగాలి శతశాతము!
కనీసము అక్షరాస్యత,. సామాజిక అవసరము!
"విద్య- వివేకము", సమస్యల, సులభ పరిష్కారము!
పౌరులు వివేకులు, తద్వారా, సమర్థ నాయకత్వము!
సరి నాయకత్వం నడిపించు, జాతి ప్రగతి పథము, పివిఎల్!
1537.
విద్య నిగూఢ గుప్త విత్తము, మానవాళికి రూపము!
విద్య నిజ ధర్మ సాధనము, యశోభాగ్యకారకము!
విద్య విదేశాల బంధువు,
విద్య నృపాల పూజితము!
విద్యకు సమాన ధనము ,
ఈఇల లేదన్న నిజము!
విద్యతోనే మనిషి మనీషి,
లేకుంటే మరి మహిషి,, పివిఎల్!
________
సర్వసిద్ధికరి!: - డా. పివిఎల్ సుబ్బారావు .-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి